Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏసీబీ ట్రాప్ - ఒకే దెబ్బకు 3 పిట్టలు.. ఆర్ఐ, ఎస్సై, తహసిల్దార్ అరెస్ట్

ఏసీబీ ట్రాప్ - ఒకే దెబ్బకు 3 పిట్టలు.. ఆర్ఐ, ఎస్సై, తహసిల్దార్ అరెస్ట్
, ఆదివారం, 7 జూన్ 2020 (16:34 IST)
అవినీతి ఆరోపణలతో రెవెన్యూ శాఖలో ఒకే దెబ్బకు మూడు పిట్టలు రాలాయి. రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవనీతి కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయని ఆరోపణలు రావడంతో... తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ శాఖపై మండిపడ్డారు. ఇంకా రెవెన్యూ శాఖనే తీసిపారేస్తానని వ్యాఖ్యానించారు. దీనిపై అనుకూల, వ్యతిరేక వాదనలు వినిపించాయి.
 
కానీ రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవనీతి కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయని తాజాగా రూ.30 లక్షల లంచం కేసు ద్వారా తెలిసింది. ఈ కేసులో... బాధితుడు సయ్యద్ ఖలీద్‌కు బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్ 14లో సొంత స్థలం ఉంది. మార్కెట్ రేటు ప్రకారం దాని విలువ రూ.40 కోట్లు. ఐతే... ఈ స్థలం ప్రభుత్వానిది అంటూ రెవెన్యూ అధికారులు స్థలంలో హెచ్చరిక బోర్డ్ పెట్టారు. దీనిపై కోర్టులో ప్రభుత్వానికీ, ఖలీద్‌కీ మధ్య కేసు నడుస్తోంది.
 
లాక్‌డౌన్ సమయంలో స్థలంలోకి వెళ్లిన ఖలీద్ ప్రభుత్వ బోర్డును తొలగించాడు. ఈ విషయం తెలుసుకున్న షేక్‌పేట తహసీల్దార్ సుజాత బంజారాహిల్స్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. బంజారాహిల్స్‌ ఎస్సై రవీందర్‌నాయక్‌ ఖలీద్‌పై కేసు రాశారు. దీంతో స్థలం తనదేననీ సర్వే చేయించి తనకు ఇప్పించాలని ఖలీద్... తహసీల్దార్‌ను కోరాడు. స్థలానికి సంబంధించిన ఫైల్ ఆర్ఐ దగ్గర ఉందనీ... ఆయన్ని కలవమని సుజాత చెప్పారు. దాంతో ఖలీద్ ఆర్ఐ నాగార్జున రెడ్డి దగ్గరకు వెళ్లాడు.
 
స్థలం రేటు ఎంత ఉంటుందో ముందే గుర్తించిన ఆర్ఐ నాగార్జున రెడ్డి... ఖలీద్ వైపు చూస్తూ... రూ.40 కోట్ల స్థలం నీదవుతుంది. మరి మాకేంటి లాభం. ఓ పని చెయ్. రూ.30 లక్షలు ఇవ్వు. పనైపోతుంది... అన్నారు. తాను డబ్బు ఇవ్వలేనని ఖలీద్ చెప్పాడు. కానీ ఆర్ఐ డబ్బిస్తే ఫైల్ కదులుతుందని లేకుంటే పని జరగదన్నాడు. ఇక ఖలీద్‌కి ఒళ్లు మండింది. ఈ రెవెన్యూ అధికారులు ఇంతే లంచాలకు రుచిమరిగారు అనుకుంటూ... తిన్నగా ఏపీబీని  కలిశాడు. మొత్తం మేటర్ చెప్పాడు.
 
ఏసీబీ ఓ ట్రాప్ ప్లాన్ ఆయనకు చెప్పింది. దాని ప్రకారం... మళ్లీ ఆర్ఐ నాగార్జున రెడ్డిని కలిసి ముందుగా రూ.15 లక్షలు ఇస్తానన్నాడు. ఆర్ఐ ఓకే అన్నారు. శనివారం బంజారాహిల్స్‌ రోడ్డు నం.2 సాగర్‌ సొసైటీ చౌరస్తాలో... ఖలీద్‌ నుంచి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ఆర్ఐ నాగార్జున రెడ్డిని పట్టుకున్నారు. యూసఫ్‌గూడలోని ఆయన ఇంట్లో చెక్ చేశారు. ఆర్ఐపై కేసు రాసి అరెస్టు చేశారు. ఇలాగే ఖలీద్ ఆరోపణలతో బంజారాహిల్స్ ఎస్సై రవీందర్‌నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతను కూడా లంచం ఇమ్మని డిమాండ్ చేశాడని.. ఇంటిని సోదాలు చేయడంలో ఈ విషయంలో వెల్లడి అయ్యిందని చెప్పుకొచ్చారు. 
 
అంతేగాకుండా.. ఇక ఈ కేసులో తహసీల్దార్ సుజాత కూడా తక్కువేమీ తినలేదన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ఆర్‌ఐతో లంచం మేటర్ మాట్లాడించిందే ఆమె అనే ఆరోపణలు రావడంతో గాంధీనగర్‌లోని ఆమె ఇంట్లో చెక్ చేశారు. రూ.30 లక్షల క్యాష్, 10 తులాల బంగారు నగలు, కొన్ని డాక్యుమెంట్లను సీజ్ చేశారు. ఇలా ఒక్క కేసులో... ముగ్గురి బండారం బయటపడింది. మొత్తానికి ఒక్క దెబ్బకు మూడు పిట్టలు పడ్డాయి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ చైనా ఒప్పందాల్లో కీలక పరిణామం- లడఖ్‌పై సానుకూల చర్చలు