యువతికి రైలు ప్రయాణంలో చేదు అనుభవం.. వెనుకభాగాన్ని తడుముతూ..?

Webdunia
బుధవారం, 22 మే 2019 (12:18 IST)
యువతికి రైలు ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్న యువతి ఆఫీస్ ముగిసిన తర్వాత రైలులో కేజీఎఫ్‌ పట్టణానికి బయలుదేరింది. 
 
ప్రయాణంలో ఆమె నిద్రపోతున్న సమయంలో వెనుకసీటులో కూర్చున్న ఓ వ్యక్తి ఆ యువతి వెనుకభాగాన్ని తడుముతూ అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి వికృత చేష్టలకు మెల్కొన్న ఆ యువతి అతడిని ప్రశ్నించింది. దీంతో ఆ వ్యక్తి మరింతగా రెచ్చిపోయాడు.
 
అతని వికృత చేష్టలకు విసిగిపోయిన ఆ యువతి పక్క బోగీలో తన స్నేహితులు ఉండటంతో వారిని పిలిచింది. స్నేహితులు వచ్చేలోపే ఆ వ్యక్తి వైట్‌ఫీల్డ్‌ స్టేషన్‌లో దిగి పారిపోయాడు. ఈ సంఘటనపై వైట్‌ఫీల్డ్‌ పోలీసులకు ఆ ఉద్యోగిని ఫిర్యాదు చేయడానికి వెళ్ళింది. 
 
కానీ వాళ్ళు ఆమె ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోకపోగా ఇది తమ పరిధిలోకి రాదని చెప్పి మరొక స్టేషన్ పోలీసులకు కంప్లైంట్ చేయమని చెప్పారు. అక్కడి పోలీసులు కూడా ఇలాంటి సమాధానమే చెప్పి, ఆ ఘటన తమ పరిధిలోకి రాదని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ అక్కడి నుంచి పంపించేశారు. 
 
దీంతో ఆ యువతి చేసేది ఏమిలేక కంటోన్మెంట్‌ పోలీసులకు ఘటన గురించి వివరించి కేసు నమోదు చేసుకోవాలంటూ కోరింది. కానీ పోలీసులు కేసు నమోదు చేయకుండా ఆ వ్యక్తి ఫోటో ఉందా, అడ్రస్‌ ఉందా, వ్యక్తి ఎవరంటూ నిర్లక్ష్యంగా ప్రవర్తించారంటూ సోషల్ మీడియాలో తన బాధను వెళ్లగక్కింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments