Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యం.. మరో సందేహం వద్దు : ఆర్కే.రోజా

Webdunia
బుధవారం, 22 మే 2019 (12:14 IST)
నవ్యాంధ్ర రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళా నేత, నగరి వైకాపా అభ్యర్థి ఆర్కే. రోజా జోస్యం చెప్పారు. ఆమె బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
ఆ తర్వాత ఆమె విలేకరులతో మాట్లడుతూ, మరి కొన్ని గంటల్లో వెల్లడికానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర ప్రజలు, వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు వల్ల రాష్ట్రం పరువు పోయిందని, అభివృద్ధిలో వెనుకబడిపోయామన్నారు. 
 
నగరి నియోజకవర్గం నుంచి తాను రెండోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని రోజా ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగడించిన లగడపాటి రాజగోపాల్‌ది స్వార్థపూరిత సర్వే అని, నిష్పక్షపాతంగా చేసింది కాదన్నారు. ఈ విషయం తమిళనాడు, తెలంగాణ ఎన్నికల ఫలితాలలో తేలిందన్నారు. 
 
లగడపాటి సర్వేను ప్రజల్లో ఒక్కరు కూడా నమ్మడం లేదన్నారు. త్వరలోనే వైఎస్‌ జగన్‌ సీఎం అవుతారని, మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెస్తారని ధీమా వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలను నమ్ముకున్న టీడీపీకి రేపటి ఫలితాలు సరైన గుణపాఠం చెబుతాయని చెప్పారు. ఐదేళ్లలో రాష్ట్ర మహిళలను అప్పులపాలు చేయడమే కాకుండా కోర్టు మెట్లు ఎక్కించారని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments