Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య, ప్రియురాలితో ఒకేసారి హనీమూన్‌కి వెళ్లిన వ్యక్తి.. చివరికి?

Webdunia
గురువారం, 9 జులై 2020 (11:54 IST)
భార్య‌తో హనీమూన్‌ కోసం ఊటీకి తీసుకెళ్లాడు. అంతకుముందే ప్రియురాలిని ఊటికి పంపించాడు. ఒకే హోటల్‌లో వేర్వేరు గదుల్లో ఇద్దరినీ ఉంచాడు. కానీ చివరకు భార్యకు దొరికిపోవడంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బళ్లారికి చెందిన మంజునాథ్‌కు ఈ ఏడాది ప్రారంభంలో బెంగుళూరుకు చెందిన యువతి(21)తో పెళ్లి అయ్యింది. 
 
మంజునాథ్ ఉద్యోగ రీత్యా సండూరులో పనిచేసేవాడు. దీంతో పెళ్లి అయిన మొదటి నెల భార్యతో కలిసి సండూరులో ఉండేవాడు. అనంతరం భార్యను పుట్టింటిలోనే వదిలిపెట్టాడు. ప్రతి వారాంతంలో నగరానికి వచ్చి భార్యతో ఉండి వెళ్లేవాడు. ఈ క్రమంలో మార్చి నెల రెండో వారంలో హనీమూన్‌కు వెళదామంటూ భార్యను తీసుకెళ్లాడు. కానీ అంతకుముందే తన ప్రియురాలిని సైతం ఊటీకి పంపాడు. ఒకే హోటల్‌లో వేర్వేరు గదులు తీసుకున్నాడు.
 
ఒక గదిలో భార్యను, మరో గదిలో ప్రియురాలిని పెట్టాడు. భార్యను హోటల్ గదిలోనే ఉంచి ప్రియురాలిని తీసుకుని విహారం చేసి వచ్చేవాడు. నిత్యం ఆఫీసు పనిమీద వెళుతున్నానంటూ భార్యను గదిలోనే ఉంచి ప్రియురాలితో పొద్దంతా తిరిగి వచ్చేవాడు. వారం రోజుల పాటు అక్కడే ఉండి బెంగళూరుకు వచ్చారు. అనంతరం మంజునాథ్ ఎప్పటిలాగే సండూరులో ఉద్యోగానికి వెళ్లాడు. వారం వారం భార్య దగ్గరకు వచ్చిపోయేవాడు.
 
అయితే ఈ విషయాన్ని భార్య పసిగట్టింది. అందులో మంజునాథ్ ప్రియురాలితో కలిసి దిగిన సెల్ఫీలు చూసి అవాక్కయ్యింది. ఆ ఫొటోలు సైతం ఊటీలో దిగినవే కావడంతో షాక్ తింది. వెంటనే తేరుకుని భర్తను నిలదీసింది. దీంతో మంజునాథ్.. నువ్వు నాకు నచ్చలేదని, రూ.25 లక్షలు ఇస్తేనే నీతో ఉంటానంటూ బదులిచ్చాడు. దీంతో ఆ మహిళ తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది తెలుసుకున్న మంజునాథ్ పరారు కాగా, అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments