Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా వైరస్ విజృంభణ.. 487మంది మృతి

Webdunia
గురువారం, 9 జులై 2020 (11:33 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24గంటల్లో కొత్తగా 24,879 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దేశంలో తొలిసారిగా ఒక్కరోజే దాదాపు 25వేల మార్కు దగ్గరకు చేరింది. 
 
దీంతో గురువారం నాటికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 7,67,296కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంతేకాకుండా వైరస్ బాధితుల్లో బుధవారం ఒక్కరోజే 487మంది మృత్యవాతపడ్డారు. దీంతో దేశంలో కొవిడ్ మరణాల సంఖ్య 21,129కి చేరింది.  
 
అలాగే మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా మహారాష్ట్రలో 6603 పాజిటివ్ కేసులు నమోదుకావడంతో మొత్తం బాధితుల సంఖ్య 2,23,724గా నమోదైంది. వీరిలో ఇప్పటి వరకు 9448 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక తమిళనాడులో బుధవారం ఒక్కరోజే 3756 కేసులు బయటపడటంతో మొత్తం కేసుల సంఖ్య 1,22,350కు చేరింది. వీరిలో 1700మంది మృత్యువాతపడ్డారు. 
 
ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఢిల్లీలో కొత్తగా 2033 కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 1,04,864కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3213మంది మృతి చెందారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments