స్విమ్మింగ్ వెళ్లిన ఓ యువకడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఓ జలగ అతని మర్మాంగంలోకి ప్రవేశించడంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలియక ఆ యువకుడు నానా తంటాలు అనుభవించాడు. ఈ ఘటన కాంబోడియాలో చోటుచేసుకుంది.
సరదాగా చేసిన స్విమ్మింగ్ ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ఘటన కాంబోడియాలో చోటుచేసుకుంది. ఓ జలగ అతని ప్రైవేట్ పార్ట్‌లోకి దూరడంతో ప్రాణాపాయంలోకి వెళ్లిపోయాడు. కానీ అసలు విషయం తెలియక పూల్ నుంచి బయటకు వచ్చిన యువకుడు ఇంటికి వెళ్ళిపోయాడు. అంతే నలతగా వుండటంతో నిద్రపోయాడు. కానీ ఉన్నట్టుండి పాయువులో నొప్పి రావడంతో నరకయాతన అనుభవించాడు.
భయంతో యువకుడు ఆస్పత్రికి పరుగులు తీశాడు. అక్కడ పరీక్షలు చేయగా.. అతని పాయువులో జలగ దూరినట్లు గుర్తించారు. జలగను బయటకు తీయడం డాక్టర్లకు కష్టంగా మారింది. శస్ర్త చికిత్స చేసి జలగను చంపి బయటకు తీశారు. ఆ జలగ.. అప్పటికే సుమారు 200 మిల్లిమీటర్ల రక్తాన్ని తాగిందని వైద్యులు తెలిపారు.