మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా కరోనా కారణంగా ఆగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో వస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ ని భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్నారు.
అయితే.. ఈ సినిమా షూటింగ్‌లో ఉండగానే.. ఎన్టీఆర్ తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయనున్నట్టు ఎనౌన్స్ చేసారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇదిలా ఉంటే... ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత చేసే సినిమా ఎనౌన్స్ చేసాడు కానీ.. చరణ్ మాత్రం తదుపరి చిత్రం ఏంటి అనేది ప్రకటించలేదు.
చరణ్ నెక్ట్స్ మూవీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... లాక్ డౌన్ టైమ్‌లో చరణ్ కథలు వింటున్నాడట. ఈ క్రమంలో సతీష్ అనే ఓ నూతన దర్శకుడు చెప్పిన కథ విన్నాడని... ఆ కథ చరణ్‌కు బాగా నచ్చిందని టాక్. వెంటనే ఫుల్ స్క్రిప్టు తయారుచేసుకుని రమ్మని చెప్పాడట.
ఇక ఫుల్ స్ర్కిప్ట్‌తో కూడా మెప్పిస్తే... గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయం. అదే కనుక జరిగితే... ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చేసే సినిమా ఇదే అవుతుంది. అలా జరిగితే... అంత భారీ చిత్రం తర్వాత కొత్త డైరెక్టర్‌తో సినిమా చేయడం అంటే.. ప్రయోగమే. మరి... ఏం జరుగనుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.