Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరవేగంగా రామాలయ నిర్మాణ పనులు-అక్టోబర్ నాటికి పునాది పనులు పూర్తి

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (12:32 IST)
అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి పునాది పనులు పూర్తి అవుతాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తన ట్విట్టర్‌లో వెల్లడించింది. అయితే ఆలయానికి సంబంధించిన గ్రౌండర్ ఫ్లోర్ వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల లోపే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. 
 
ఆలయ నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఇంజినీర్లు, కార్మికులు అంతా ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నట్లు ట్రస్టు పేర్కొన్నది. ప్రతి రోజు రెండు ఫిఫ్ట్‌లుగా పనులు జరుగుతున్నట్లు ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. 
 
పునాది పనులను రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ టెక్నిక్‌లో పూర్తి చేయనున్నారు. సుమారు లక్షా 20 వేల చదరపు ఫీట్ల విస్తీర్ణంలో 40 నుంచి 45 లేయర్లలో కాంక్రీట్ వేయనున్నారు. ఇప్పటికే నాలుగు లేయర్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఆర్‌సీసీ పనులు అక్టోబర్ నాటికి పూర్తి కానున్నట్లు ట్రస్టు తన ట్వీట్‌లో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments