Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగి అంత్యక్రియల్లో పాల్గొన్న 150 మంది 21 మంది మృతి.. ఎక్కడ?

Webdunia
శనివారం, 8 మే 2021 (17:23 IST)
కరోనా వైరస్ సూపర్ స్పైడర్‌గా మారుతోంది. ఒకర నుంచి అనేకమందికి అంటే పదుల సంఖ్యలో ఈ వైరస్ సోకుతోంద. తాజాగా ఓ కరోనా రోగి అంత్యక్రియల్లో పాల్గొన్న 21 మందికి ఈ వైరస్ సోకింది. దీనికి కారణం కరోనా నిబంధనలను తుంగలో తొక్కడమే. కొవిడ్‌-19 సోకిన రోగి అత్యంక్రియల్లో కరోనా నిబంధ‌న‌లు పాటించ‌కుండా ఖ‌న‌నం చేసిన ఘ‌ట‌న‌లో 21 మంది మృత్యువాత‌ప‌డ్డారు. వీరిలో ఎక్కువ మంది వృద్ధులు ఉన్నారు. 
 
ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని సికార్ జిల్లాలోని ఖేర్వా గ్రామంలో చోటుచేసుకుంది. కాగా వీరిలో క‌రోనా వైర‌స్ కార‌ణంగా నాలుగు మ‌ర‌ణాలు మాత్ర‌మే సంభ‌వించిన‌ట్లు అధికారులు తెలిపారు. మిగ‌తావారు వ‌యోభారం కార‌ణంగా చనిపోయిన‌ట్లు వెల్ల‌డించారు.
 
ఈ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత నెల 21వ తేదీన కరోనా వైరస్ సోకి చనిపోయారు. ఆయన మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. గ్రామంలో ఆయనకు మంచి పలకుబడివుండటంతో పాటు.. మంచి వ్యక్తి కూడా. దీంతో ఆయన అంత్య‌క్రియ‌ల్లో సుమారు 150 మంది పాల్గొన్నారు. 
 
అయితే, వీరంతా క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌కుండా మృత‌దేహాన్ని ఖ‌న‌నం చేశారు. మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో నుంచి బయటకు తీసిన‌ట్లు, ఖననం చేసే సమయంలో చాలా మంది దానిని తాకినట్లు స్థానికులు తెలిపారు. మొత్తం 21 మరణాలలో కేవ‌లం ముగ్గురు లేదా న‌లుగురు మాత్ర‌మే కొవిడ్‌-19తో చ‌నిపోయిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. 
 
కొవిడ్‌-19తోనే మ‌ర‌ణించారా? లేదా అని తెలుసుకునేందుకు తాము 147 కుటుంబాల నుండి శాంపిల్స్‌ను సేక‌రించిన‌ట్లు అధికారులు తెలిపారు. స‌మ‌స్య తీవ్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని గ్రామంలో శానిటైజేష‌న్ డ్రైవ్‌ను చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు. అదేవిధంగా స‌మ‌స్య తీవ్ర‌త‌ను గురించి గ్రామస్థుల‌కు వివ‌రించడం జ‌రిగింద‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments