Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్మశానంలో కాలిన శవాలను పీక్కుని తింటున్న వ్యక్తి.. వణికిపోయిన జనం..

Advertiesment
శ్మశానంలో కాలిన శవాలను పీక్కుని తింటున్న వ్యక్తి.. వణికిపోయిన జనం..
, శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (13:01 IST)
ఒళ్లు గగొర్పొడిచే అత్యంత దారుణ ఘటనతో మహారాష్ట్రంలోని సతారా జిల్లా వాసులు వణికిపోయారు. శ్మశానంలో కరోనాతో చనిపోయినవారి శవాలను పీక్కుని తింటున్న ఓ యువకుడిని చూసిన స్థానికులు గుండెలు హడలిపోయారు. అది చూసినవారంత వణికిపోయారు. ఓ యువకుడు శ్మశానంలో సగం కాలిన కరోనా శవాలను తింటున్నాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ వార్త విన్న పోలీసులకు కూడా షాక్ అయ్యారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం సతారా జిల్లాలోని కోలకి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న శ్మశాన వాటికలో ఓ యువకుడు తిరుగుతూ స్థానికులకు కనిపించాడు. అలా తిరుగుతూ తిరుగుతూ అక్కడే సగం కాలిపోయిన శవాలను తింటుండగా గ్రామస్తులు కొంతమంది చూశారు. అంతే వారికి కాళ్లూ చేతులూ ఆడలేదు. అదే విషయాన్ని మరికొందరిని పిలిచి చూపించారు. 
 
వాళ్ల పరిస్థితి కూడా అదే. దీంతో వెంటనే పోలీసులకు.. స్థానిక అధికారులకు సమాచారం అందించారు. ఆ వార్త విన్న పోలీసులు కూడా కాసేపు వారు విన్నది నిజమో కాదోనని మరోసారి అడిగి తెలుసుకున్నారు.అదే విషయాన్ని గ్రామస్తులు చెప్పేసరికి హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు.
 
కానీ అప్పటికే గ్రామస్థుల అలికిడి విన్న సదరు యువకుడు అక్కడ నుంచి పరారయ్యాడు. శ్మశాన వాటికలో తిరుగుతూ సగం కాలిన కరోనా మృతదేహాల అవయవాలను తింటున్నాడని అధికారులు అక్కడి చేరుకునే లోపే అతడు పరారయ్యాడు. కానీ గ్రామస్తులు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం కొంతమందిని తీసుకుని సదరు యువకుడి కోసం గాలించగా సాయంత్రానికల్లా దొరికాడు.
 
వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నించగా..పిచ్చి పిచ్చిగా హిందీ మాట్లాడటం చూసి అతనిడి వెంటనే పరీక్షల కోసం హాస్పిటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగాల్ దంగల్ : ఫలితాలకు ముందే మేల్కొన్న మమత!!