Webdunia - Bharat's app for daily news and videos

Install App

హృదయాన్ని ద్రవింపజేస్తూ.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో.. మీరూ చూడండి...

ఎలాంటి పనీపాట లేకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతూ, నిత్యం అంతర్జాలంలో మునిగిపోయే నెటిజన్లకు ఈ వీడియో ఓ చెంపపెట్టులాంటిది. లక్షల మందికి స్ఫూర్తి నింపుతూ, మరెంతో మందికి కన్నీళ్లు తెప్పిస్తోందీ వీడియో. ఇంత

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (12:54 IST)
ఎలాంటి పనీపాట లేకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతూ, నిత్యం అంతర్జాలంలో మునిగిపోయే నెటిజన్లకు ఈ వీడియో ఓ చెంపపెట్టులాంటిది. లక్షల మందికి స్ఫూర్తి నింపుతూ, మరెంతో మందికి కన్నీళ్లు తెప్పిస్తోందీ వీడియో. ఇంతకీ ఆ వీడియో ఏంటన్నదే కదా మీ సందేహం. 
 
ఇద్దరు చిన్నారులు ఓ పార్కులోని జారుడు బల్లపై ఆడుకుంటున్నారు. అందులో ఏముందని అనుకుంటున్నారా? ఓ చిన్నారి పదే పదే వేగంగా ఎక్కుతూ బల్లపై జారుతూ ఉంటే, మరో పాప చేస్తున్న ప్రయత్నమే అందరిలో లక్ష్య సాధన దిశగా స్ఫూర్తిని రగిలిస్తోంది. 
 
ఇంతకీ ఆ పాపకు రెండు కాళ్లు, రెండు చేతులూ లేవు. కానీ ఎలాగైనా మెట్లు ఎక్కి జారుడు బల్లపై నుంచి జారాలన్న ప్రయత్నంలో విజయం సాధించింది. పాప ప్రయత్నాన్ని అభినందిస్తున్న ఎందరో సెలబ్రిటీలు ఈ వీడియోను రీట్వీట్ చేస్తున్నారు. 
 
అలా రీట్వీట్ చేసిన వారిలో టెక్ దిగ్గజం, మహీంద్రా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఉన్నారు. ఈ వీడియోను చూసిన ఆయన ఇలా కామెంట్స్ చేశారు. "హృదయాన్ని ద్రవింపజేసిన వీడియో ఇది. ఇంత ఉద్వేగభరితమైన వీడియోను నేను చూడలేకపోయాను. కానీ దీన్ని చూసిన తర్వాత ప్రపంచంలో ఏ పని కూడా కష్టమైనది కాదని భావిస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోనూ మీరూ చూడండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments