Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అర్జున్ రెడ్డికి కొత్త చిక్కు... నాగరాజు నోటీసులు.. వెంకీతో విజయ్ దేవరకొండ సినిమా?

వివాదాల చుట్టూ తిరిగిన అర్జున్ రెడ్డి సినిమా సరికొత్త వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా కథను తన వ్యక్తిగత అనుభవాల ఆధారంగా తయారుచేసుకున్నానని దర్శకుడు సందీప్ రెడ్డి చెబుతుండగా, ఆ కథ తనదేనంటూ ఖమ్మంకు చెంది

Advertiesment
అర్జున్ రెడ్డికి కొత్త చిక్కు... నాగరాజు నోటీసులు.. వెంకీతో విజయ్ దేవరకొండ సినిమా?
, బుధవారం, 30 ఆగస్టు 2017 (17:33 IST)
వివాదాల చుట్టూ తిరిగిన అర్జున్ రెడ్డి సినిమా సరికొత్త వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా కథను తన వ్యక్తిగత అనుభవాల ఆధారంగా తయారుచేసుకున్నానని దర్శకుడు సందీప్ రెడ్డి చెబుతుండగా, ఆ కథ తనదేనంటూ ఖమ్మంకు చెందిన దర్శకుడు డి.నాగరాజు చెప్తున్నాడు.

అంతేగాకుండా దీనికి సంబంధించి దర్శక నిర్మాతలకు నోటీసులు పంపాడు. గతంతో తాను తెరకెక్కించిన 'ఇక సె..లవ్' సినిమా కథనే యథాతథంగా తెరకెక్కించారని అతడు ఆరోపించారు. వెంటనే ఈ సినిమా ప్రదర్శనను ఆపేయాలని, తన అనుమతి లేకుండా తన కథతో సినిమా తీసినందుకు రూ.2 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.
 
ఓ వైపు వివాదాలున్నా.. మరోవైపు అర్జున్ రెడ్డి కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్నాడు. దీంతో విజయ్ దేవరకొండ పారితోషికాన్ని పెంచేశాడట. అర్జున్ రెడ్డి రిలీజ్‌కు తర్వాత విజయ్ దేవరకొండ అరడజను సినిమాలు ఒప్పుకున్నాడట. అల్లు అరవింద్‌తో పాటు కొంతమంది నిర్మాతలు విజయ్ దేవరకొండతో అగ్రిమెంట్ కూడా చేయించుకున్నారని వినికిడి. ''అర్జున్ రెడ్డి' సినిమాతో ఒక్కసారిగా తనకి స్టార్ డమ్ వచ్చేయడంతో, దానికి తగినట్టుగా రెమ్యునరేషన్‌ను కూడా పెంచాలని విజయ్ దేవరకొండ భావిస్తున్నట్లు సమాచారం. 
 
కాగా త్వరలోనే వెంకటేశ్ చేసే మరో మల్టీ స్టారర్ మూవీ చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో వెంకీతో కలిసి విజయ్ దేవరకొండ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడని తెలిపింది. రాక్ లైన్ వెంకటేశ్ నిర్మించనున్న ఈ సినిమాకి, భాస్కర్ దర్శకుడిగా వ్యవహరిస్తాడట.

ఇక అర్జున్ రెడ్డి భారీ వసూళ్లను రాబడుతూ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. దాంతో తమిళ యువ హీరోలు ఈ సినిమాపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. తమిళంలో అర్జున్ రెడ్డి రీమేత్ హక్కల కోసం నిర్మాతలు ప్రయత్నిస్తుంటే.. హీరోలు పోటీపడుతున్నారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజనీకాంత్‌తో బిగ్ బాస్ ఓవియా పోటాపోటీ.. అబ్బా.. అన్ని రీ ట్వీట్లా?