కాలేజీ విద్యార్థినితో పోలీస్ మజా.. తల్లిదండ్రులకు వాట్సాప్‌లో ఫోటోలు షేర్
రక్షణ కల్పించాల్సిన పోలీసే.. విద్యార్థినిని వాడుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమెతో సన్నిహితంగా వున్న అభ్యంతరకరమైన ఫోటోలను ఏకంగా ఆమె తల్లిదండ్రులకు వాట్సాప్‌లో షేర్ చేశాడు. ఆపై ఆ పోలీసును పోలీసులే అరెస్ట్
రక్షణ కల్పించాల్సిన పోలీసే.. విద్యార్థినిని వాడుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమెతో సన్నిహితంగా వున్న అభ్యంతరకరమైన ఫోటోలను ఏకంగా ఆమె తల్లిదండ్రులకు వాట్సాప్‌లో షేర్ చేశాడు. ఆపై ఆ పోలీసును పోలీసులే అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు విల్లుపురం, సెంజి సమీపంలో ఉన్న వేంబూరుకు చెందిన మణికండన్ (30) పోలీసుగా పనిచేస్తున్నాడు. ఇతడు ఆ ప్రాంతంలోని అమ్మోరు ఆలయానికి భద్రత కోసం వెళ్తూ వస్తుండే వాడు. ఈ క్రమంలో అక్కడ పువ్వుల దుకాణం నడుపుతున్న పుదుచ్చేరి మహిళతో అతనికి పరిచయం ఏర్పడింది.
ఈమె కుమార్తె కళాశాలలో చదువుతోంది. సెలవులకు తల్లికి తోడుగా పువ్వుల అమ్మకాలను చూసుకుంటూ వుండేది. అలా కాలేజీ విద్యార్థినితో కూడా అతనికి స్నేహం కుదిరింది. ఈ స్నేహం శారీరక సంబంధానికి దారితీసింది. ఈ నేపథ్యంలో మణికండన్ కిలియూరుకు బదిలీ అయ్యాడు. అయితే కళాశాల విద్యార్థినితో ఉల్లాసంగా గడిపిన సందర్భంగా ఆమెకు తెలియకుండానే మణికంఠన్ ఫోటోలు తీశాడు.
ఇంతలో మణికంఠన్‌కు వివాహమైన విషయం కళాశాల విద్యార్థినికి తెలియరావడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో మణికంఠన్‌కు ఆ విద్యార్థిని దూరమైంది. అయినా వదలని మణికంఠన్ ఆమెను ఫోనులో వేధించాడు. ఆమెను తనతో రావాల్సిందిగా బలవంతం చేశాడు. అందుకు ఆమె ససేమిరా అనడంతో విద్యార్థినితో ఉల్లాసంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలను ఆమె తల్లిదండ్రులకు వాట్సాప్‌లో షేర్ చేశాడు. దీంతో షాక్ అయిన బాధితురాలి తల్లిదండ్రులు మణికంఠన్‌పై మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు మణికంఠన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.