హిందుత్వ రాజకీయాలను విమర్శించినందుకే గౌరీ లంకేష్ హత్య?

బెంగుళూరులో ప్రముఖ సీనియర్ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ (55)ను గుర్తుతెలియని వ్యక్తి తుపాకీతో కాల్చి చంపారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బెంగళూరులోని తన ఇంటి గేటు తీస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు బ

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (14:41 IST)
బెంగుళూరులో ప్రముఖ సీనియర్ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ (55)ను గుర్తుతెలియని వ్యక్తి తుపాకీతో కాల్చి చంపారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బెంగళూరులోని తన ఇంటి గేటు తీస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌లపై వచ్చి ఆమెపై పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్పులు జరిపారు. తూటాలు ఆమె మెడ, ఛాతీ భాగాల్లో దూసుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. 
 
అయితే, గౌరీ లంకేశ్ ఇంటి ముందు అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజ్ ఇప్పుడు పోలీసుల ముందు సవాలుగా నిలిచింది. ఆమె తన ఇంట్లో అమర్చుకున్న సీసీటీవీలకు ఓ పాస్ వర్డ్‌ను పెట్టుకుని ఉండటమే ఇందుకు కారణం. నిందితుల వివరాలు ఈ కెమెరాల్లో రికార్డు అయి ఉంటాయని స్పష్టం చేసిన పోలీసులు, ఇప్పుడా పాస్ వర్డ్‌ను ఛేదించే పనిలో పడ్డారు. 
 
ఆ పాస్‌వర్డ్ ఆమెకు మాత్రమే తెలుసునని వెల్లడించిన సిట్ అధికారులు, రాష్ట్ర సైబర్ నిపుణులు వీడియోలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ ప్రక్రియ పూర్తయితే, ఎంత మంది హత్యలో పాల్గొన్నారన్న విషయం తేటతెల్లమవుతుందని అంటున్నారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ విచారణకు అత్యంత కీలకమని తెలిపారు.  
 
కాగా, ఈ హత్యను పలువురు నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేవలం హిందుత్వ రాజకీయాలను విమర్శించినందుకే ఈమెను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత మనీష్ సిసోడియాలు ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. "ఇది కచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే.." వ్యాఖ్యానించారు. 
 
అలాగే, సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ... "ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య వార్త విని షాక్ అయ్యాను. ఈ దారుణాన్ని ఖండించడానికి మాటలు కూడా రావడం లేదు. వాస్తవానికి ఇది ప్రజాస్వామ్యాన్ని చంపేయడమే. ఆమె మరణంతో కర్ణాటక ఓ బలమైన ప్రగతిశీల గళాన్ని కోల్పోయింది. నేను ఓ మంచి స్నేహితురాలిని కోల్పోయాను.." అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అలాగే, గౌరీ లంకేశ్ హత్యోదంతంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 'బెంగళూరు సహా పలుచోట్ల ఎందుకింత దారుణాలు చోటుచేసుకుంటున్నాయి? దీనిపై ఎడ్యూరప్ప నిరవధిక సత్యాగ్రహాన్ని చేపట్టాలి. లేకుంటే బెంగళూరు 1930ల నాటి చికాగో నగరంలా మారుతుంది...' అని ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

Akhanda 2: అఖండ 2 క్రిస్ మస్ కు తాండవం చేస్తుందా ? దామోదర ప్రసాద్ ఏమన్నారంటే..

మణికంఠ తీసిన కొత్తపెళ్లికూతురు షార్ట్ ఫిలిం చాలా ఇష్టం : మెహర్ రమేష్

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ల పోలీస్ కంప్లెయింట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments