Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దారుణం... జర్నలిస్టును ఇంటిముందే కాల్చి చంపేశారు...

కర్ణాటక రాజధాని బెంగుళూరులో దారుణం జరిగింది. మహిళా సీనియర్ జర్నలిస్టును ఆమె ఇంటి ముందే కాల్చి చంపారు. గుర్తు తెలియని వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డారు. హత్యకు గురైన జర్నలిస్టు పేరు గౌరీ లంకేష్. స్థానిక

Advertiesment
దారుణం... జర్నలిస్టును ఇంటిముందే కాల్చి చంపేశారు...
, బుధవారం, 6 సెప్టెంబరు 2017 (09:20 IST)
కర్ణాటక రాజధాని బెంగుళూరులో దారుణం జరిగింది. మహిళా సీనియర్ జర్నలిస్టును ఆమె ఇంటి ముందే కాల్చి చంపాడు. గుర్తు తెలియని వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. హత్యకు గురైన జర్నలిస్టు పేరు గౌరీ లంకేష్. వయసు 55 యేళ్లు. స్థానిక రాజరాజేశ్వరి నగర్‌లోని తన సొంత ఇంట్లోనే ఆమె హత్యకు గురయ్యారు. 
 
మంగళవారం సాయంత్రం ఆమె నివాసానికి ఓ గుర్తుతెలియని వ్యక్తి వెళ్లి తలుపు తట్టాడు. తలుపు తీయగానే ఆమెపై కాల్పులు జరిపి పారిపోయాడు. ఈ సంఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఛాతీ, మెడ భాగంలో మూడు బుల్లెట్లు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ఆమె కుప్పకూలిపోయింది. కేసు దర్యాప్తుకు ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు విచారణాధికారులు వెల్లడించారు. 
webdunia
 
కాగా, గౌరి 'లంకేశ్‌పత్రికే' అనే కన్నడ వీక్లీ టాబ్లాయిడ్‌ను నడుపుతున్నారు. పత్రికలో ఆమె స్వతంత్రంగా, నిర్భయంగా అభిప్రాయాలను వెలిబుచ్చేది. ఆమె సైద్ధాంతిక సిద్దాంతంతో విభేదించే వ్యక్తులే ఈ హత్య చేసి ఉంటారని సమాచారం.

అయితే, ధార్వాడ్ బీజేపీ ఎంపీ ప్రహ్లాద్ జోషి, మరో బీజేపీ నేత ఉమేశ్ ధుషితో ఆమెకు వివాదాలు ఉన్నాయి. 2008 జనవరి 23న ఆమె రాసిన కథనాలపై ఈ ఇద్దరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెపై పరువునష్టం కేసులు వేశారు. దీంతో వారిద్దరిపై కూడా అనుమానాలు వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సద్దాం హుస్సేన్‌కు పట్టిన గతే కింగ్ జాంగ్‌ ఉన్‌కు పడుతుందట...