Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేన్సర్‌ వ్యాధితో ఐసీయులో చనిపోయిన భార్య... తుపాకీతో కాల్చుకుని భర్త ఆత్మహత్య!!

వరుణ్
బుధవారం, 19 జూన్ 2024 (13:06 IST)
అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతిలో ఓ విషాదకర ఘటన జరిగింది. కేన్సర్ వ్యాధి సోకిన భార్య ఐసీయూ వార్డులో చికిత్స పొందుతూ కన్నుమూసింది. భార్య చనిపోయిందన్న వార్తను జీర్ణించుకోలేని భర్త.. ఐసీయూ వార్డులోనే భార్య శవం పక్కనే తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... 
 
శిలాదిత్య చెతియా అనే అధికారి అస్సాం హోంశాఖ కార్యదర్శిగా పనిచేసేవారు. ఆయన 2009 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన భార్య కొద్దికాలంగా కేన్సర్‌తో బాధపడుతున్నారు. గౌహతిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెను దగ్గరుండి చూసుకునేందుకు నాలుగు నెలలుగా చెతియా సెలవులోనే ఉన్నారు. అయితే మంగళవారం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ప్రాణాలు తుదిశ్వాస విడిచారు. 
 
'ఈ విషయం తెలిసిన వెంటనే చెతియా ఐసీయూ వద్దకు వచ్చారు. ఆమెవద్ద కొద్దిసేపు ఒంటరిగా ఉంటానని చెప్పి, అక్కడున్న వైద్యసిబ్బందిని బయటకు వెళ్లమని కోరారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మాకు తుపాకీ శబ్దాలు వినిపించాయి. వెళ్లిచూడగా.. ఆయన తన తుపాకీతో కాల్చుకున్నారు. మేం ఆయన్ను రక్షించేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. తీవ్రంగా గాయపడటంతో చనిపోయారు' అని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.
 
ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. 'భార్య అనారోగ్యంతో బాధపడుతున్నప్పటి నుంచి ఆయన ఆందోళనగా కనిపించేవారు. ఆమెవద్దే ఉండి బాగోగులు చూసుకునేవారు. ఇప్పుడు ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది' అని వెల్లడించారు. తీన్‌సుకియా, సోనిత్‌పుర్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేసిన శిలాదిత్య.. అస్సాం పోలీసు విభాగానికి చెందిన ఫోర్త్‌ బెటాలియన్‌కు కమాండెంట్‌గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత  హోంశాఖ కార్యదర్శి స్థాయికి ఎదిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments