Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

car accident

వరుణ్

, ఆదివారం, 16 జూన్ 2024 (16:17 IST)
దేవభూమిగా పేరుగాంచిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఓ మినీ వ్యాను అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ప్రమాదం శనివారం జరిగింది. దేవభూమిలోని పర్యాటక ప్రాంతాలను చూసొద్దామని బయలుదేరిన టూరిస్టులు రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నారు. వారు ప్రయాణిస్తున్న మినీ బస్సు అదుపుతప్పి హైవే పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. దాదాపు 1500 అడుగుల పైనుంచి పడడంతో బస్సు నుజ్జునుజ్జుగా మారింది. అందులోని 26 మంది టూరిస్టుల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. రుద్రప్రయాగ్ జిల్లాలో శనివారం చోటుచేసుకుందీ దారుణం.
 
ఢిల్లీకి చెందిన 26 మంది టూరిస్టులు ఓ మినీ బస్సులో ఉత్తరాఖండ్ యాత్రకు బయలుదేరారు. శనివారం రుద్రప్రయాగ్ జిల్లా చేరుకున్నారు. రిషికేశ్-బద్రినాథ్ హైవేపై అలకనందా నది పక్క నుంచి వెళుతుండగా ప్రమాదం జరిగింది. మినీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వారిని ఢీ కొడుతూ అలకనందా నదిలో పడిపోయింది. చాలా ఎత్తు నుంచి పడడంతో మినీ బస్సు దారుణంగా దెబ్బతింది. లోపల ఉన్న టూరిస్టుల్లో 10 మంది అక్కడికక్కడే చనిపోగా ఆస్పత్రికి తరలిస్తుండగా మరో నలుగురు కన్ను మూశారు. మిగిలిన 12 మందికి తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారిని రిషికేశ్ ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)