Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

నదిలో దూకిన ప్రేమజంట.. కాపాడి ప్రియుడి చెంప పగలగొట్టిన జాలరి!!

Advertiesment
slaps

వరుణ్

, ఆదివారం, 16 జూన్ 2024 (10:57 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాల్ పూర్‌లో ఓ షాకింగ్ సంఘటన జరిగింది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకునేందుకు నదిలో దూకింది. దీన్ని గమనించిన కొందరు మత్స్యుకారులు ఆ ప్రేమ జంటను రక్షించారు. ముఖ్యంగా, ప్రియుడిని రక్షించి గట్టుకు తీసుకొచ్చిన తర్వాత ఓ జాలరి.. రెండు చెంపలు పగులగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కొత్వాలి నగరంలోని గోలాఘాట్ వద్ద గోమతి నదిలోకి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకునేందుకు దూకింది. దీన్ని అక్కడే ఉన్న కొందరు జాలర్లు చూశారు. వెంటనే అప్రమత్తమైన ఆ జాలర్లలో ఒకరు నదిలో దూకి ఆ ఇద్దరినీ రక్షించి, ఒడ్డుకు చేర్చాడు. ఆ తర్వాత అతడు ప్రియుడి చెంప పగులగొట్టాడు. అతడు చేసిన పనికి ఆగ్రహంతో ఊగిపోయిన మత్స్యుకారుడు జీవితం ఎంత విలువైనదో చెబుతూ మూడు నాలుగు సార్లు బలంగా చెంపపై కొట్టడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఆ తర్వాత ఒడ్డుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అయితే, నదిలో దూకి నీరు తాగడం వల్ల ఆ యువతి మాత్రం కొంత అస్వస్థతకు గురైంది. ఆ తర్వాత వారిద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
 
అన్న చనిపోయాడని వదినను పెళ్లాడిన యువకుడి హత్య.. ఎక్కడ?
 
ఉత్తప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. అన్న చనిపోయిన తర్వాత విధవగా మారిన తన వదినను వివాహం చేసుకున్న యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ చర్య ఆ కుటుంబంలోని ఇతర సోదరులకు ఏమాత్రం నచ్చకోపవడంతో ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌పత్ గ్రామానికి చెందిన ఈశ్వర్ అనే వ్యక్తికి సుఖ్‌వీర్, ఓంవీర్, ఉదయ్ వీర్, యశ్‌వీర్ అనే నలుగురు కునమారులు ఉన్నారు. వీరిలో పెద్దవాడైన సుఖ్‌వీర్ గత యేడాది చనిపోయాడు. ఈ క్రమంలో అతని భార్య.. సోదరుల్లో అందరికంటే చిన్నవాడైన యశ్‌వీర్‌ను పెళ్లి చేసుకుంది. ఇది మిగిలిన ఇద్దరు సోదరులకు ఏమాత్రం నచ్చలేదు. అప్పటి నుంచిం వారి కుటుంబంలో తరచుగా గొడవలు ప్రారంభమయ్యాయి. 
 
అయితే, ఇవేమీ పట్టించుకోని యశ్‌వీర్ తాను మాత్రం తన విధుల్లో నిమగ్నమైపోయాడు. ఈ క్రమంలో ఢిల్లీలో డ్రైవర్‌గా పని చేసే యశ్‌వీర్.. శుక్రవారం రాత్రి తన విధులను ముగించుకుని ఇంటికొచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న మిగిలిన ఇద్దరు సోదరులు.. తమ తల్లితో వాగ్వాదానికి దిగారు. యశ్‌వీర్ రాకతో ఈ వివాదం మరింతగా ముదిరింది. దీంతో విచక్షణ కోల్పోయిన ఇద్దరు సోదరులు.. తమ్ముడు అని కూడా చూడకుండా యశ్‌వీర్‌ను తుపాకీతో కాల్చి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు... సంఘటనా స్థలానికి చేరుకుని కాల్పులకు పాల్పడిన ఓంవీర్, ఉదయ్ వీర్‌లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్లాప్ పేరుతో చెత్త పన్ను వసూలు చేసిన వైకాపా ప్రభుత్వం.. రద్దు చేసిన టీడీపీ సర్కారు!