Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా : అరవింద్ కేజ్రీవాల్

ఠాగూర్
ఆదివారం, 15 సెప్టెంబరు 2024 (15:17 IST)
తాను మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆయన ఆదివారం తొలిసారి పార్టీ కొత్త ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత ఆయన కీలక ప్రసంగం చేశారు. మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. "నేను ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడుగుతాను. నేను నిజాయితీపరుడిని అనుకుంటే ప్రజలు నాకు ఓటు వేస్తారు. అపుడు నేను మళ్లీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొంటా. లేదంటే లేదు" అని ప్రకటించారు. మరో రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని, ఆ తర్వాత పార్టీ ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుందని, ఆ తర్వాత సీఎం పేరును వెల్లడిస్తామని తెలిపారు. 
 
అయితే, అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల పార్టీలో అంతర్గతంగా చర్చ మొదలైంది. దీంతో ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాలే ఉండాలని పార్టీలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. అయితే, కేజ్రీవాల్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏమిటంటే... నవంబరులో ఎన్నికలకు వెళ్లి సత్తా నిరూపించుకోవాలని ఆయన భావిస్తున్నారని భరద్వాజ్ వివరించారు. ప్రజలు కేజ్రీవాల్ నిజాయతీపరుడు అని గుర్తిస్తే ఆప్ ఎన్నికల్లో గెలుస్తుందని, కేజ్రీవాల్ మరోసారి సీఎం అవుతారని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments