Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో చొరబడేందుకు సిద్ధంగా 250 మంది ఉగ్రవాదులు

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (10:39 IST)
భారత్‌‍లో చొరబడేందుకు 250 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని లాంచ్ ప్యాడ్‌ల వద్ద ఈ ఉగ్రవాదులు నిరీక్షిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో గస్తీని ముమ్మరం చేసింది. 
 
భారత భూభాగంలోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వద్ద సుమారు 250 మంది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నిరీక్షిస్తున్నారని నిఘా వర్గాల హెచ్చరిక నేపధ్యంలో సైన్యం అలర్ట్ అయింది. సరిహద్దుల్లో గస్తీని ముమ్మరం చేసింది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తిప్పికొట్టేందుకు సన్నద్ధమైంది. ముఖ్యంగా ఉత్తర కాశ్మీరులోని కేరన్ పోస్ట్ వద్ద నిఘాను తీవ్రతరం చేసింది. 
 
మరోవైపు, ఇటీవలికాలంలో పాకిస్థాన్ నుంచి మన దేశంలోకి ఉగ్రవాదుల చొరబాట్లు తగ్గినప్పటికీ... డ్రగ్స్ మాత్రం పెద్ద ఎత్తున అక్రమంగా రవాణా అవుతున్నాయి. డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బులతో పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది. 
 
ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ మాట్లాడుతూ, ఉగ్రవాదులే కాకుండా మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలు, ఆయుధాలు భారత్‌లోకి రాకుండా నిఘాను కట్టుదిట్టం చేశామని చెప్పారు. ఇంకోవైపు, జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌‍కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులను భద్రతాదళాలు కాల్చి చంపాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments