బిగ్ బాస్ రియాల్టీ షో ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ ఆరో సీజన్ తొలిరోజే ఏకంగా 21 మందితో హౌస్ నిండిపోయింది. మొదటి రోజు నుంచే హౌస్‌లో ఆట మొదలైపోయింది. వచ్చిన కంటెస్టెంట్స్‌కి అప్పుడే సపోర్ట్‌గా సోషల్ మీడియాలో హడావిడి మొదలుపెట్టేశారు.
మొదటి రోజు ఉదయం గార్డెన్‌లో కంటెస్టెంట్లు అంతా కలిసి డ్యాన్సులు వేశారు. పక్కా లోకల్ పాటకు కంటెస్టెంట్లంతా చిందులు వేశారు. ఈ సమయంలో అంతా సరదాగా ఉండి ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత అసలు ఆట మొదలైంది. మొదటి రోజు నుంచే గొడవలు మొదలయ్యాయి. బాత్‌రూమ్‌లో వెంట్రుకలు పడ్డాయని గీతూ రాయల్ హాలులోకి వచ్చి అందరిముందు అరిసింది.
ఎవరి పని వాళ్లు చేయాలనే రూల్ ఉన్నా వేరే వాళ్ల వెంట్రుకలు మాత్రం నేను తీయను అని అరిచింది గీతూ. ఇంతలో వెనుకైనా నుంచి ఒక కంటెస్టెంట్ ఆ వెంట్రుకలు ఇనయా సుల్తానావి అని చెప్పడంతో గీతూ, సుల్తానా మధ్య కాసేపు ఈ జుట్టు పంచాయితీ నడిచింది. వీళ్ళిద్దరూ అరుచుకుంటూ ఉంటే మిగిలిన వాళ్లంతా సైలెంట్ గా వీళ్ళనే చూస్తూ ఉన్నారు.
ఇక ఆ తర్వాత మొదటి రోజు నుంచే టాస్కులు ఉంటాయని బిగ్‌బాస్ ఇచ్చిన ఫైల్‌ని ఫైమా అందరికి చదివి వినిపించింది. ఇందులో హౌజ్‌లోని సభ్యులను క్లాస్, ట్రాష్, మాస్ అంటూ భాగాలుగా విడిపోవాలి. ఎవరు క్లాస్, ఎవరు ట్రాష్, మాస్ అనేది వాళ్లే తేల్చుకోవాలి.
క్లాస్ సెక్షన్ వాళ్లు సకల సౌకర్యాలు అనుభవిస్తారని, ట్రాష్ వాళ్లు బయట గార్డెన్ ఏరియాలో వంట చేసుకోవాలని బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చారు. దీంతో అందరూ డివైడ్ అయ్యారు.
అనంతరం ఇద్దరు కంటెస్టెంట్లు కొబ్బరి బోండాలోని నీళ్లు కింద పడకుండా ఒకరినొకరు కొట్టుకోవాలని టాస్క్ ముగిసే సమయానికి ఎవరి బోండంలో ఎక్కువ నీళ్లు ఉంటాయో వాళ్లే విన్నర్ అని చెప్పారు. ఇందులో ఆదిరెడ్డి, ఇనయా ఆడగా ఆదిరెడ్డి విన్నర్ అయ్యారు.
తొలి రోజు హౌస్‌లో కీర్తి భట్‌తో సూర్య పులిహోర కలిపేందుకు ప్రయత్నించాడు. పిచ్చి అని ఎవరినో పిలుస్తుంటాడు సూర్య. కీర్తి వేసుకున్న టీ షర్ట్ మీద కామెంట్ చేశాడు సూర్య.. అచ్చం అలాంటి టీ షర్ట్ తన వద్ద ఉందని చెప్పాడు. వేసుకోవాల్సిందిగా అని కీర్తి అంటే.. రేపు వేసుకుంటాను అని సూర్య అంటాడు.
ఆ తరువాత ఇంకేంటి? పిచ్చి అని అంటాడు సూర్య. ఏమన్నావ్ అని కీర్తి షాక్ అవుతుంది. పిచ్చి అని నేను అంటుంటాను అలా అనడం నాకు ఇష్టమని సూర్య అంటే..పిచ్చి అనేది ఫేవరేట్ వర్డ్ అంటూ కీర్తి తెగ సిగ్గు పడుతుంది.