Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముత్తూట్ ఫైనాన్స్‌కు కన్నం.. 25 కేజీల బంగారం చోరీ

Webdunia
శనివారం, 23 జనవరి 2021 (09:17 IST)
కొందరు సాయుధ చోరీ ముఠా తమ చేతివాటం ప్రదర్శించింది. ముత్తూట్ ఫైనాన్స్‌కు కన్నం వేసి ఏకంగా 25 కేజీల బంగారాన్ని చోరీచేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని హోసూరులో జరిగింది. ఈ చోరీ కూడా పట్టపగలే జరగడం గమనార్హం. 
 
పోలీసుల కథనం ప్రకారం.. హోసూరు - బాగలూరు రోడ్డులో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలోకి మాస్కులు, హెల్మెట్లు ధరించిన ఆరుగురు దుండగులు ప్రవేశించారు. ఆ సమయంలో లోపల ఐదుగురు సిబ్బంది, ముగ్గురు వినియోగదారులు ఉన్నారు.
 
లోపలికి వచ్చిన దుండగులు తొలుత సెక్యూరిటీ గార్డుపై దాడిచేశారు. ఆ తర్వాత మేనేజర్, నలుగురు సిబ్బందిని తుపాకితో బెదిరించి రూ. 7.5 కోట్ల విలువైన 25 కేజీలకు పైగా బంగారం, లాకర్లలో ఉన్న 96 వేల నగదును ఎత్తుకెళ్లారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు దుండగులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరు కర్ణాటకకు పారిపోయి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు మూడు బృందాలను బెంగళూరుకు పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments