Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మరో 61,408 పాజిటివ్‌ కేసులు

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (10:59 IST)
దేశంలో గత 24 గంటల్లో 61,408 మందికి కరోనా సోకింది. దీంతో సోమవారం నాటికి కరోనా కేసుల సంఖ్య 31,06,348కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అదే సమయంలో 836 మంది మఅతి చెందారని, ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 57,542కి చేరింది.

పెరుగుతున్న పాజిటివ్‌ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. రికవరీల కూడా క్రమంగా పెరుగుతోందని వెల్లడించింది. ఆదివారం 57వేల మంది కరోనా నుండి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు 23,38,036 మంది కరోనా నుండి కోలుకున్నారు. 7 లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్య శాఖ పేర్కొంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రికవరీల రేటు 75 శాతానికి చేరింది. దేశంలో కరోనా వైరస్‌ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

రికవరీలు, యాక్టివ్‌ కేసుల మధ్య తేడా అధికంగా ఉందని, ప్రస్తుతం రికవరీల సంఖ్య యాక్టివ్‌ కేసుల సంఖ్య కన్నా మూడు రెట్లు అధికంగా ఉందని వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,28,566 మంది కరోనా నుండి కోలుకోగా, 7,07,668 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ డేటా తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"గేమ్ ఛేంజర్" టీజర్‌ను ఏయే థియేటర్లలో రిలీజ్ చేస్తారు?

పుష్ప-2 నుంచి దేవీ శ్రీ ప్రసాద్‌ను పక్కనబెట్టేశారా? కారణం?

పారిశ్రామికవేత్త బర్త్‌డే పార్టీలో ఎంజాయ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు

త్రిబాణధారి బార్బరిక్ లో సరికొత్త అవతారంలో ఉదయ భాను

అమ్మవారి జాతర నేపథ్యంగా జాతర- మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments