Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో తొలి కార్గో ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం.. హైదరాబాద్ - న్యూఢిల్లీ మధ్య సరుకు రవాణా షూరు

దేశంలో తొలి కార్గో ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం.. హైదరాబాద్ - న్యూఢిల్లీ మధ్య సరుకు రవాణా షూరు
, గురువారం, 6 ఆగస్టు 2020 (07:15 IST)
సర‌కు రవాణా రంగంలో సమృద్ధిని సాధించడంతో పాటు వినియోగదారులకు ఉత్తమ సేవల‌ను అందించడ‌మే లక్ష్యంగా దేశంలోనే మొట్టమొదటి టైం-టేబుల్ గూడ్స్ రైలును ద‌క్షిణ మ‌ధ్య రైల్వే స‌నత్‌నగర్ (హైద‌రాబాద్) నుండి ప్రారంభించింది.

హైదరాబాద్‌లోని సనత్‌నగర్ రైల్వేస్టేషన్ నుండి న్యూఢిల్లీలోని ఆదర్శనగర్ స్టేషన్ల మధ్య నడిచే ఈ 'కార్గో ఎక్స్ ప్రెస్' రైలు ప్రతి బుధవారం బయలుదేరుతుంది. ఈ వినూత్న ప్రయోగం 6నెలల పాటు ప్రయోగాత్మకంగా అమలు జరుగుతుంది.
సాధారణంగా.. సర‌కు రవాణా రైళ్ళ ద్వారా పలు పారిశ్రామిక ఉత్పత్తులు అధిక మొత్తాలలో రవాణా చేయడం ఆనవాయితి.

కాని ఇటీవలి కాలంలో నెలకొన్న పరిస్థితుల మూలంగా స్వల్ప మొత్తాల్లో కూడా సరుకులను రవాణా చేసే సంస్థల సంఖ్య పెరిగింది. ఈ రంగంలో నెలకొన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ వినియోగదారులకు విస్తతమైన అవకాశాలను కల్పిస్తూ దక్షిణ మధ్య రైల్వే వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్గో ఎక్స్ ప్రెస్ సేవలతో సింగిల్ వ్యాగన్ బుక్ చేసుకునే వినియోగదారులకు సైతం వేగవంతమైన రవాణా సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

రోడ్డు రవాణా మార్గం లేదా రైల్వే పార్శిల్ రవాణా చార్జీలతో పోల్చినపుడు వినియోగదారులకు 40శాతం తక్కువ ధరకే వేగవంతమైన రవాణా సుదపాయం లభిస్తుంది. సనత్‌నగర్ నుండి ప్రారంభమైన ఈ కార్గో ఎక్స్ ప్రెస్ గంటకు 50 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ శుక్రవారం నాటికి న్యూఢిల్లీలోని ఆదర్శనగర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది.

భారతీయ రైల్వే సర‌కు రవాణా సౌకర్యవంతమైన ఈ కార్గో ఎక్స్ ప్రెస్ సేవల విధానానికి రూపకల్పన చేసిన జోనల్ అధికారులు మరియు సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ప్రత్యేకంగా అభినందించారు.

రైల్వే ద్వారా సరుకు రవాణా సౌకర్యవంతమైంద‌ని, అత్యంత భద్రత కలిగిన సదుపాయమని, నూతన విధానం వల్ల చాలా వేగవంతంగా మారినందున పరిశ్రమలు, వస్తు సేవల సంస్థలు సౌకర్యాన్ని వినియోగించుకోవడానికి ముందుకు రావాలని కోరారు.

ఇతర రవాణా మార్గాల‌తో పోలిస్తే ఎంతో చవకైన కార్లో ఎక్స్ ప్రెస్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్గో ఎక్స్ ప్రెస్ సేవలను వినియోగించుకునే సంస్థల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లకు ఏర్పాటు చేశారు. ఆసక్తి ఉన్నవారు 9701371976 లేదా 040-27821393 ఫోన్ నంబర్లపై సంప్రదించాల‌ని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీజీహెచ్, ఎన్నారై ఆసుపత్రుల్లో 'ప్లాస్మా థెరపీ ప్రారంభం'.. ప్లాస్మా దానం చేసిన పొన్నూరు ఎమ్మెల్యే