Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంట్లో ఏమేం చేయవచ్చు?.. ఎపిఎస్‌ఎస్‌డిసి అద్భుత అవగాహనా శిక్షణ

ఇంట్లో ఏమేం చేయవచ్చు?.. ఎపిఎస్‌ఎస్‌డిసి అద్భుత అవగాహనా శిక్షణ
, మంగళవారం, 30 జూన్ 2020 (08:48 IST)
కరోనా వ్యాప్తి సందర్భంగా అందరం సాధ్యమైనంతవరకు ఇంటికి పరిమితం అవుతున్నాము. పౌష్టిక సమతుల్య ఆహారం తీసుకోవడానికి ప్రభుత్వం వారి ద్వారా అనేక సూచనలు చేయడం జరిగింది. 
 
అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రత్యేకించి మహిళలు ఇంటిలోనే లేదా మిద్దె పైన సేంద్రీయ ఆకుకూరలు, కూరగాయలు మెడిసినల్ ప్లాంట్స్ మొదలైన వాటి పెంపకంలో మెళకువలు నేర్చుకునే విధంగా ఆన్లైన్లో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతోంది.

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి), ఎంబిఎస్ అర్బన్ టెర్రస్ ఆధ్వర్యంలో మిద్దెతోటల పెంపకం (రూఫ్ టాప్ గార్డెనింగ్) పై ఒకరోజు వైబ్నర్ ద్వారా ఉచితంగా అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
 
కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మన ఇంటి పంట-మన ఇంటి వంట అన్న స్లోగన్ తో ఈ అవగాహనా కార్యక్రమం నిర్వహించనున్నారు.
 
జూలై 1న (బుధవారం) ఉదయం 11 గంటలకు జూమ్ యాప్ ద్వారా ఆన్ లైన్లో పాల్గొనవచ్చు. ఈ అవకాశాన్ని ముఖ్యంగా గృహిణులు సద్వినియోగం చేసుకోవచ్చు. 
 
ఎవరు అర్హులు?:
మిద్దె తోటల పెంపకం అనే అంశంపై జూమ్ మీటింగ్ లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న వారందరూ అర్హులే. ఈ లింక్ https://rb.gy/bkqw3e  ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు https://zoom.us/j/98248650698 ద్వారా లాగిన్ కావచ్చు. 
 
ఈ ఆన్ లైన్ శిక్షణలో కవర్ చేయబడే అంశాలు:
1) ఇంటి పైకప్పుపై తోట (రూఫ్ టాప్ గార్డెనింగ్)పై పరిచయం
2) రూఫ్ టాప్ గార్డెనింగ్ డిజైన్, పాట్ మిక్స్, కంటైనర్స్/ గ్రో బ్యాగులు, ఇంటి కంపోస్టింగ్
3) సస్టైనబుల్ హోమ్ గార్డెన్, గ్రీన్ హౌస్ ప్రాముఖ్యత, ఎక్కువ సూర్యరశ్మి నుంచి మొక్కలను కాపాడుకోవడం ఎలా? ఎలాంటి మైక్రో ఇరిగేషన్ పద్దతులు అవలంభించాలి?
4) మైక్రో గ్రీన్స్ మరియు రోగనిరోధక శక్తిని పెంచేవి
5) ఇంట్లోనే ఎరువులు తయారు చేసుకోవడం, తెగులు వికర్శకాలు
6) రూఫ్ టాప్ గార్డెన్ లో పెంచుకునే అవకాశం ఉన్న ఔషధ మొక్కలు
7) ఇండోర్ ప్లాంట్లు మరియు కిచెన్ గార్డెన్
8) కాలానుగుణంగా వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు మరియు పండ్లు నాటుకోవడం ఎలా?
 
రూఫ్ టాప్ గార్డెనింగ్ వల్ల ఈ క్రింది ప్రయోజనాలు:
1) మన ఇంటిపై కప్పుపై ఎలాంటి రసాయనిక అవశేషాలు కలపని ఆకుకూరలు, కూరగాయలు, పూల మొక్కలు పెంచుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 
 
ఇంటి పైకప్పుపై మొక్కల పెంపకం ద్వారా మనకు అవసరమైన ఆహారం, ఎండ నుంచి ఉపశమనం, హైడ్రోలాజికల్ ప్రయోజనాలు, పలురకాల పక్షులకు అవాసాలుగాను మరియు పెద్ద ఎత్తున పర్యావరణ ప్రయోజనాలు పొందవచ్చు. 
 
2)  గ్రామీణ, గిరిజ ప్రాంతాల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థలైన ఐ.ఎఫ్.ఎ.డి (ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్) మరియు ప్రపంచ బ్యాంక్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలపై ట్రైనర్ కిరణ్ కుమార్ గారికి 20 సంవత్సరాల అనుభవం ఉంది. 
 
ఒకరోజు ట్రయల్ తర్వాత పైన సూచించబడిన మిద్దె పైన పండించుకునే కూరగాయలు పూల మొక్కల విషయమై ప్రతిరోజు రెండు గంటల సేపు ఆన్లైన్ లో శిక్షణ ఇవ్వబడుతుంది మూడు రోజులపాటు. 
 
తదుపరి ఈ శిక్షణలో నైపుణ్యం పొందిన మహిళలు ఎవరి కైన  పై ఈ విషయంలో  సహాయం కావాల్సి వస్తే  ఇందులో నైపుణ్యం పొందిన యువతీ యువకులు మీ మీ ఇంటికి వచ్చి మీ అపార్ట్మెంట్స్లో ఉన్న వారందరికీ ప్రాక్టికల్  గా డిమాన్ స్టేషన్  చేసి చూపించడమే కాకుండా, విత్తనాలు మొదలు ఇతర వస్తువులు కూడా ఎలా సమకూర్చుకోవాలి అన్న విషయాల పైన కూడా తెలియజేస్తారు మరియు  సహాయం చేస్తారు.
 
వాతావరణం కనుగుణంగా ఇంటిలోనే కుండీలలో మనకు కావలసిన పూలు మరియు కాయ గూర  మొక్కలు మిద్దె పైన  పెంపకం విషయంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ కరోనా ని ఎదుర్కొనే భాగంగా ఈ కార్యక్రమం తీసుకురావడం జరుగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ