Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిపై నాలుగుసార్లు అత్యాచారం, నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ వార్నింగ్...

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (20:58 IST)
ప్రేమ ముసుగులో పెళ్లి చేసుకుంటానని నమ్మించి కాలేజ్ అమ్మాయి మీద అత్యాచారం చేశాడు. రేప్ కేసులో జైలుకు వెళ్లిన యువకుడు తనను జైలుకు పంపించిన యువతి మీద కక్ష తీర్చుకోవాలని బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ ఆమె మీద అత్యాచారం చేశాడు.

రేప్ కేసు పెట్టి నన్ను జైలుకు పంపిస్తావా? ఇప్పుడు మళ్లీ రేప్ చేశా, నీకు దిక్కున్న చోట చెప్పుకో, నన్ను మళ్లీ జైలుకు పంపిస్తే బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ నిన్ను రేప్ చేస్తానని, నీతో పాటు మీ అమ్మ, అన్నను చంపేస్తానని యువతిని బెదిరించాడు.
 
బెంగుళూరు నగరంలోని కోణనెకుంటలో ఇరవైయేళ్ళ అమ్మాయి నివాసం ఉంటోంది. కాలేజ్ అమ్మాయి నివాసం ఉంటున్న ప్రాంతంలోనే అక్బర్ బాష అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని అక్బర్ బాష కాలేజ్ అమ్మాయి వెంటపడ్డాడు.
 
తనను ఎంతో ప్రేమిస్తున్నాడని, సంతోషంగా చూసుకుంటాడని, పెళ్లి చేసుకుంటాడని కాలేజ్ అమ్మాయి అక్బర్ బాషను నమ్మింది. మొదట్లో అతనితో శారీరకంగానే కలిసినా ఆ తరువాత మాత్రం అక్బర్ బాష యువతి మీద బలవంతంగా అత్యాచారం చేశాడు. ఆ తరువాత పెళ్లి చేసుకోనని అక్బర్ బాష ఎదురుతిరిగాడు. ఆ సమయంలో ఆవేదన చెందిన యువతి మోసం చేసిన అక్బర్ బాష మీద అత్యాచారం కేసు పెట్టడంతో కోణెనెకుంట పోలీసులు అక్బర్ బాషను అరెస్టు చేసి జైలుకు పంపించారు.
 
అత్యాచారం కేసులో బెయిల్ మీద బయటకు వచ్చిన అక్బర్ బాష కాలేజ్ నుంచి ఇంటికి వెలుతున్న యువతి మీద దాడి చేశాడు. తరువాత యువతి మీద అత్యాచారం చేసిన అక్బర్ బాష మళ్లీ కేసు పెడితో నీతో పాటు మీ అమ్మ, అన్నను చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు అక్బర్ బాషను అరెస్టు చేసి మళ్లీ జైలుకు పంపించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments