Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి- ఫుడ్ స్టాల్.. తందూరీ, రోటీల విషయంలో గొడవ.. ఇద్దరు యువకుల బలి.. ఎలా?

సెల్వి
సోమవారం, 5 మే 2025 (19:16 IST)
Tandoori Roti
ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలో ఒక వివాహానికి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అయితే, తందూరీ, రోటీల విషయంలో జరిగిన చిన్న వివాదం ఇద్దరు యువకుల దారుణ మరణానికి దారితీసింది. వివాహ కార్యక్రమంలో భాగంగా ఒక ఫుడ్ స్టాల్ వద్ద జరిగిన మాటల ఘర్షణలో 17 ఏళ్ల ఆశిష్, 18 ఏళ్ల రవిని కొట్టి చంపేశారు. 
 
ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆశిష్, రవి తందూరి రోటీ కౌంటర్ వద్ద ఆహారం కోసం క్యూలో నిలబడ్డారని పోలీసులు తెలిపారు. వారికి వరుడి బంధువు రోహిత్, అతని కొంతమంది స్నేహితులు, ఇతర అతిథుల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో రోహిత్ బృందం జరిగిన వివాదాన్ని అవమానంగా భావించారు. 
 
అంతే పెళ్లి నుండి స్నేహితుల బృందంతో బయటకు వెళ్ళిన తర్వాత, రోహిత్, అతని సహచరులు ఇనుప రాడ్లు, హాకీ స్టిక్స్, లాఠీలతో ఆశిష్, రవిలను వెంబడించారని తెలుస్తోంది. ఆపై ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావంతో ఆశిష్, రవి ప్రాణాలు కోల్పోయారు.  
 
ఆశిష్, రవి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 13 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనుమానితులలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, ఇతరులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అమేథి అదనపు ఎస్పీ హరేంద్ర కుమార్ ధృవీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments