Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాత్రి బోయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది, తెల్లారేసరికి శవమై కనబడింది, ఏమైంది?

Advertiesment
deadbody

ఐవీఆర్

, సోమవారం, 5 మే 2025 (16:54 IST)
ఇటీవలి కాలంలో అమ్మాయిలు-అబ్బాయిలు కలిసి రాత్రిపూట పార్టీలు చేసుకోవడం కామన్ అవుతోంది. ఐతే అంతా బాగానే వుంటే సరి. కానీ ఏదైనా తేడా వచ్చిందంటే ఎవరో ఒకరు తెల్లారేసరికి సమస్యల్లో చిక్కుకుని తన్నుకుంటుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని మహానగర్ ప్రాంతంలో 28 ఏళ్ల వయసున్న పవన్ నివాసముంటున్నాడు. ఈ క్రమంలో ఇతడితో పనిచేసే వారితో పరిచయాలున్నాయి. దీనితో తరచూ తను అద్దెకి ఉంటున్న గదికి రమ్మంటూ ఫోన్లు చేస్తుంటారు. వచ్చినవారితో సరదాగా గడపడం అతడి అలవాటు. దీనితో తనకు బాగా పరిచయమున్న 24 ఏళ్ల యువతికి ఫోన్ చేసి రమ్మని పిలిచాడు. ఆమె వెంటనే అతడి వద్దకు చేరుకుంది. ఇక ఆరోజు రాత్రి ఏమైందో తెలియదు కానీ తెల్లారేసరికి ఆమె శవమై కనబడింది. అతడు పరారీలో వున్నాడు.
 
కాగా ఆమె తల్లిదండ్రులు మాట్లాడు.... తమ కుమార్తెపై అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. కాగా మృతురాలి భౌతిక కాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Madhya Pradesh: ఏకలవ్య స్కూల్ ప్రిన్సిపాల్, లైబ్రేరియన్‌.. ఇద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు..(video)