Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త దూరంగా ఉండి ఉద్యోగం మానెయ్యమంటే ఏంచేస్తావు?

భర్తకు దూరంగా ఉండి ఉద్యోగం మానెయ్యమంటే ఏం చేస్తావు అనే ప్రశ్నకు యూపీపీఎస్సీ విజేత చెప్పిన సమాధానానికి ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు మంత్రముగ్ధులయ్యారు. దీంతో యూపీపీఎస్సీ నిర్వహించిన పీసీఎస్ (జే) పరీక్ష ఫస్

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (15:02 IST)
భర్తకు దూరంగా ఉండి ఉద్యోగం మానెయ్యమంటే ఏం చేస్తావు అనే ప్రశ్నకు యూపీపీఎస్సీ విజేత చెప్పిన సమాధానానికి ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు మంత్రముగ్ధులయ్యారు. దీంతో యూపీపీఎస్సీ నిర్వహించిన పీసీఎస్ (జే) పరీక్ష ఫస్ట్ అటెంప్ట్‌లో 54వ ర్యాంకు అలహాబాద్‌కు చెందిన యువతి విజయం సాధించింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఇటీవల యూపీపీఎస్సీ, పీసీఎస్ (జే) పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో అలహాబాద్‌లోని గోవింద్‌పూర్‌‌‌కు చెందిన ఓ యువతి తన తొలి ప్రయత్నంలోనే 54వ ర్యాంకు సంపాదించింది. దీంతో మీడియా ఆమెను తొలి ప్రయత్నంలోని సివిల్ జడ్జి పరీక్షలో విజేతగా నిలవడంపై అభినందించింది.
 
ఈ సందర్భంగా ఇంటర్వూలో తాను ఎదుర్కొన్న ప్రశ్న, జవాబును ఆమె వివరించింది. ఇంటర్వ్యూ హాల్‌లో అడుగుపెట్టిన ఆకృతితో బోర్డు మెంబర్లు... "ఒకవేళ మీ భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి, చాలా దూరంలో పని చేస్తున్నారనుకుందామనుకోండి.. నేను ఉద్యోగం చేస్తాను... నువ్వు మానెయ్ అని అడిగితే ఏం చేస్తారు?" అని ప్రశ్నించారు.
 
దానికి ఆమె సమాధానం ఇస్తూ... ‘నాకు కుటుంబం కూడా ముఖ్యమే. కుటుంబంతో ఉండటాన్ని నేను బాగా ఇష్టపడతాను. అయితే నా భర్త ఉద్యోగం మానేయమని అడిగితే ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తాను. మొదట్లో అతను ఒప్పుకోకపోవచ్చు. అయినా ప్రయత్నిస్తాను. అతన్ని ఒప్పంచగలననే నమ్మకం నాకుంది’ అంటూ చెప్పింది. దీనికి ముగ్దులైన ఇంటర్వ్యూ బోర్డు మెంబర్లు ఆమెను ఉత్తీర్ణురాలిని చేశారని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments