Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారణాసిలో మోదీకి పోటీగా ప్రియాంకా గాంధీనా...? అవసరమా?

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (14:18 IST)
ఉత్తరప్రదేశ్, వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ కీలక నేత ప్రియాంకా గాంధీ ఎదుర్కోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ తరపున అజయ్ రాయ్ వారణాసిలో మోదీతో పోటీగా బరిలోకి దిగుతున్నారు. వారణాసి నియోజకవర్గానికి గాను.. బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. శుక్రవారం ఈ మేరకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. 
 
ఈ నేపథ్యంలో వారణాసిలో మోదీతో బరిలోకి దించే అభ్యర్థి పేరును కాంగ్రెస్ ప్రకటించకుండా సస్పెన్స్‌లో వుంచింది. అయితే వారణాసిలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీని పోటీకి దించుతారని జోరుగా ప్రచారం సాగింది. ప్రియాంక గాంధీ ఈ నెల 29వ తేదీ నామినేషన్ దాఖలు చేసే అవకాశం వున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ వారణాసిలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థిని ఆ పార్టీ గురువారం ప్రకటించింది.
 
ఇందులో భాగంగా అజయ్ రాయ్ పేరును తెరపైకి తెచ్చింది. గోరఖ్ పూర్ నియోజకవర్గంలో మదుసూధన్ తివారీ పోటీ చేస్తున్నట్లు కూడా కాంగ్రెస్ ప్రకటన చేసింది. దీంతో వారణాసిలో ప్రియాంక గాంధీ పోటీకి దించే విషయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గిందని టాక్ వస్తోంది. మోదీతో ప్రియాంక పోటీ వద్దని కాంగ్రెస్ సీనియర్ నేతలు సలహా ఇవ్వడంతోనే ఆమెను మోదీ పోటీ చేసే వారణాసిలో బరిలోకి దించలేదని సమాచారం.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments