Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

ఠాగూర్
ఆదివారం, 15 జూన్ 2025 (11:37 IST)
ఇటీవల అహ్మదాబాద్ నగరంలో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయిన వారిలో వడోదరాకు చెందిన యాస్మిన్ వోరా (51), ఆమె మేనల్లుడు పర్వేజ్ వోరా (30), ఆయన నాలుగేళ్ళ కుమార్తె జువేరియాలు ఉన్నారు. ఈ వార్త వారి కుటుంబ సభ్యులను, బంధువులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
 
యాస్మిన్ వోరాకు వాస్తవానికి జూన్ 9వ తేదీనే లండన్‌కు ప్రయాణం కావాల్సివుంది. అయితే థాస్రాకు చెందిన తన మేనల్లుడు పర్వేజ్, అతని కుమార్తె జువేరియాతో కలిసి ప్రయాణించేందుకు ఆమె తన ప్రయాణ టిక్కెట్‌ను 12వ తేదీకి మార్చుకుని, చివరకు మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని తలచకుని యాస్మిన్ భర్త బోరున విలపిస్తున్నాడు. 
 
పైగా, ప్రమాదం జరిగిన రోజున యాస్మిన్‌ను ఆమె భర్త యాసిన్ స్వయంగా విమానాశ్రయంలో వదిలిపెట్టారు. విమానం టేకాఫ్ కావడానికి కొన్ని నిమిషాల ముందు యాస్మిన్ తన భర్త యాసిన్‌కు ఫోన్ చేసి విమానంలో ఏసీ సరిగ్గా పని చేయడం లేదని, తనకు ఏదో తెలియని ఆందోళనగా, అదోలా అనిపిస్తోందని చెప్పినట్టు యాసిన్ గుర్తుచేసుకున్నారు. అలాంటిదేమీ ఉండదు. కాసేపటికి ఏసీ ఆన్ అవుతుంది. అని నేను ఆమెకు ధైర్యం చెప్పాను అని ఆయన తన భార్యతో జరిగిన చివరి సంభాషణ తలచకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments