Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఒక్కడు మినహా మిగిలిన వారంతా చనిపోయారు... ఎయిరిండియా

ఠాగూర్
శుక్రవారం, 13 జూన్ 2025 (09:21 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన విమాన ప్రమాదంలో ఒకే ఒక్క ప్రయాణికుడు మినహా మిగిలిన 241 మంది చనిపోయారని ఎయిరిండియా అధికారికంగా వెల్లడించింది. అహ్మదాబాద్ నుంచి లండన్‌లోని గాట్విక్‌ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిరిడియాకు చెందిన బోయింగ్ ఏఐ171 రకం విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే జనావాస ప్రాంతాలపై కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సహా మొత్తం 242 మందిలో 241 మంది చనిపోయారని, ఎయిరిండియా అధికారికంగా వెల్లడించింది. అదృష్టవశాత్తు ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపింది. 
 
కాగా, 12 యేళ్లనాటి బోయింగ్ 787-8 డ్రీమ్ విమానం గురువారం మధ్యాహ్నం 1.38 గంటలకు అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరింది. అయితే, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం అదుపుతప్పి సమీపంలోని ఒక హాస్టల్ భవనంపై పడి పేలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. 
 
వీరిలో 139 మంది భారత పౌరులు కాగా, 53 మంది బ్రిటీష్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్ వారు, ఒక కెనడియన్ జాతీయుడు ఉన్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో సజీవంగా బయటపడిన ఏకైక వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటీష్  జాతీయుడుని, ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఎయిరిండియా పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments