Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలిగా మారిన ట్రంప్.. ట్విట్టర్లో షేర్.. ఆ వీడియోలో మోదీ భార్య కూడా? (video)

Webdunia
ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (17:10 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ పర్యటనలో భాగంగా సోమవారం (ఫిబ్రవరి 24)న ఢిల్లీ చేరుకుంటారు. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తికి ఆతిథ్యం ఇవ్వటానికి భారత్ సిద్ధంగా వుంది. ఈ పర్యటనలో భాగంగా వేయికోట్ల డాలర్ల - అంటే దాదాపు 70,000 కోట్ల రూపాయల మినీ వాణిజ్య ఒప్పందం ఈ పర్యటనలో కుదిరే అవకాశం ఉండటంతో రెండు దేశాల వాణిజ్య సంబంధాలకు ఈ పర్యటన చాలా ముఖ్యమైనదనే ప్రచారం జరుగుతోంది. 
 
అయితే, ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, భారీ వాణిజ్య ఒప్పందాన్ని భవిష్యత్తు కోసం దాచానని... అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు లేదా తర్వాత ఆ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలన్నది అమెరికా ఆలోచన అని చెప్పారు. 
 
ఇదిలా ఉంటే ట్రంప్ భారత పర్యటనను పురస్కరించుకుని సోషల్ మీడియా సెటైర్లు పేలుతున్నాయి. ఫిబ్రవరి 24, 25 తేదీలలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన పర్యటనకు సంబంధించి హీరో ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సినిమాకు చెందిన ఒక మార్ఫ్ వీడియోను తన ట్వీట్టర్‌లో షేర్ చేశారు. అది సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తుంది. 
 
భారత్‌లోని తన స్నేహితులను కలవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని ఆ వీడియోకు ట్యాగ్ చేశారు. ఆ మార్ఫ్ వీడియోలో ట్రంప్‌తో పాటు.. మెలానియా ట్రంప్, ఇవాంక ట్రంప్, జూనియర్ ట్రంప్ కూడా ఉన్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వీడియోలో వీరితో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఆయన భార్య జశోధా బెన్ కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments