భారత్ రానున్న డొనాల్డ్ ట్రంప్.. కూలిన స్వాగత ద్వారాలు

ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (15:14 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి భారత్ రానున్న నేపథ్యంలో భారత్ ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్, ఆయన సతీమణి మెలనియా భారత పర్యటన చేయనున్నారు. ఇక ఈ టూర్‌పై అగ్రరాజ్యం అధినేత కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగించనున్న మొతేరా స్టేడియం వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన స్వాగత ద్వారం ఒకటి ఆదివారం నాడు కుప్పకూలింది. 'నమస్తే ట్రంప్' ఈవెంట్ కోసం తుది సన్నాహకాలు జరుగుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. 
 
అదృష్టవశాత్తు స్వాగత ద్వారం కూలిన సందర్భంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇలాంటి స్వాగత ద్వారాలు స్టేడియం వద్ద నిర్వాహకులు చాలానే ఏర్పాటు చేశారు. 49,000 మందిని ఆపగలిగే సామర్థ్యం ఉన్న ఈ స్టేడియంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, నరేంద్ర మోదీ సోమవారంనాడు సంయుక్తంగా ప్రసంగించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం తక్కువ ధరకే విల్లాల పేరుతో ఘరానా మోసం.. నిందితుడి అరెస్ట్