Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండియన్-2 క్రేన్ ప్రమాదం.. శంకర్ - కమల్‌లకు సమన్లు

Advertiesment
ఇండియన్-2 క్రేన్ ప్రమాదం.. శంకర్ - కమల్‌లకు సమన్లు
, శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (11:57 IST)
భారతీయుడు -2 చిత్ర షూటింగ్ సెట్‌లో జరిగిన క్రేన్ ప్రమాదంపై ఆ చిత్ర దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్‌లకు పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో చిత్ర హీరో, దర్శకుడు, నిర్మాతతో పాటు.. క్రేన్ యజమాని, ఆపరేటర్, ప్రొడక్షన్ మేనేజర్ పేర్లను పొందుపరిచారు. ఇపుడు వీరందరికీ సమన్లు జారీచేశారు. 
 
కాగా, చెన్నై నగర శివారు ప్రాంతంలో ఉన్న ఈవీపీ స్టూడియోలో ఇండియన్-2 చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ కోసం ఉపయోగిస్తున్న ఓ భారీ క్రేన్ 150 అడుగుల ఎత్తు నుంచి ఓ టెంటుపై పడింది. ఈ ప్రమాదంలో దర్శకుడు శంకర్ సహాయకులు ముగ్గు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
అంతేకాదు దర్శకుడు శంకర్‌కు కూడా గాయాలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దానిపై అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు ఈ ఘటనపై నిర్మాణ సంస్థ లైకా సంస్థ సానుభూతిని వ్యక్తపరిచింది. అలాగే మృతుల కుటుంబాలకు హీరో కమల్ హాసన్ కోటి రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అది నేర్చుకోవడానికి కొడుకును విదేశాలకు పంపుతున్న బాలయ్య