Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముకేశ్ అంబానీ తనయుడి ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం రూ.200 కోట్లు ఖర్చు

ఠాగూర్
మంగళవారం, 5 మార్చి 2024 (14:23 IST)
దేశ పారిశ్రామికదిగ్గజం, అపరకుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్‌లో ఈ వేడుకలను కన్నులపండుగగా నిర్వహించారు. మొత్తం మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలకు బాలీవుడ్ చిత్రపరిశ్రమతో పాటు పలువురు సినీ సెలెబ్రిటీలు, దేశ విదేశీ క్రికెటర్లు, ఐటీ కంపెనీల యజమానులు, దేశ పారిశ్రామిక వేత్తలు  ఇలా అన్ని రంగాల వారు తరలివచ్చారు. 
 
ఈ వేడుకకు వచ్చిన  అతిథులకు ఏర్పాట్లతో పాటు వేడుక కోసం ప్రత్యేకంగా సెట్టింగ్‌లు వేయించి మరీ ఈ వేడుకను నిర్వహించారు. అన్నదానంతో మొదలైన వేడుకలకు హస్తాక్షర్‌తో ముగింపు పలికారు. అయితే, ఈ వేడుక కోసం అంబానీ ఎంత ఖర్చు చేశారనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.
 
మూడు రోజుల ఈ వేడుకలో భోజనాల ఖర్చే రూ.200 కోట్ల పైచిలుకు అని తెలిసింది. అతిథులకు వందలాది రుచులను పరిచయం చేస్తూ సిద్ధం చేసిన మెనూకు అంబానీ భారీ మొత్తం వెచ్చించారట. ఇక ఈ వేడుకలో రెండు గంటలపాటు ఆడిపాడినందుకు పాప్ సింగర్ రిహానాకు ఏకంగా రూ.52 కోట్లు చెల్లించారట. 
 
సినిమా సెట్టింగ్‌లను తలపించేలా వేసిన సెట్టింగులు, అతిథుల కోసం ఫైవ్ స్టార్ హోటల్‌ను మరిపించేలా చేసిన ఏర్పాట్లకు.. మొత్తంగా కలిపి ఈ వేడుకకు ముఖేశ్ అంబానీ అక్షరాలా రూ.1260 కోట్ల నుంచి రూ.1300 కోట్ల మేరకు ఖర్చు చేసినట్టు అంచనా వేస్తున్నారు. అయితే, వాస్తవంలో మాత్రం ఈ ఖర్చు ఇంకా ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటీనటులకు ప్రభుత్వం ఏమి చేయాలో చెప్పనవసరం లేదు- సిద్ధార్థ్

ప్రణీత్ హనుమంతుపై ఫైర్ అయిన సుధీర్ బాబు.. చీడపురుగు అంటూ?

ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా చిత్రం.. స్పిరిట్‌లో కొరియన్ యాక్టర్?

ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ చీరలో బుట్టబొమ్మ

కమల్ హాసన్‌ వాయిస్‌తో అదరగొట్టిన హాస్యబ్రహ్మ... video

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పనస పండు ఆరోగ్య ప్రయోజనాలు

వెల్లుల్లి వాసన పడదా.. మహిళలు రెండు రెబ్బలు తింటే?

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

తర్వాతి కథనం
Show comments