Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముహూర్త సమయానికి వరుడు రాలేదని బావను వివాహం చేసుకున్న వధువు.. ఎక్కడ?

child marriage

వరుణ్

, గురువారం, 29 ఫిబ్రవరి 2024 (09:38 IST)
పెళ్లి ముహూర్త సమయానికి వరుడు రాకపోవడంతో ఆగ్రహించిన వధువు.. ఆ పెళ్లి వేడుకలోనే ఉన్న తన బావను వివాహం చేసుకుంది. వధువు చేసిన పనికి పెళ్లికి వచ్చినవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సామూహిక వివాహ కార్యక్రమంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద యూపీ ప్రభుత్వం నూతన దంపతులకు రూ.51 వేల చొప్పున అందజేస్తుంది. ఈ క్రమంలో జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా జరిగిన సామూహిక వివాహ వేడుకలో 132 జంటలకు పెళ్లిళ్లయ్యాయి. ఇక, బామౌర్‌‍కు చెందిన ఖుషీ వివాహం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛతర్ పూర్‌కుప చెందిన వృష్ భానుతో నిశ్చయమైంది. అయితే, పెళ్లి సమయంలో మాత్రం వధువు పక్కన మరో వ్యక్తి కనిపించాడు.
 
ఈ క్రమంలో అధికారులు ఆరా తీయగా పెళ్లికొడుకు వేళకు రాలేదని తేలింది. దీంతో, పెద్దల సలహా మేరకు తాను కూర్చున్నట్టు నకిలీ వరుడు చెప్పాడు. అతడు ఖుషీకి వరుసకు బావ అవుతాడని కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి లలితా యాదవ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అగ్నికి వాయువు తోడైంది : వైకాపా బుగ్గి కావడం తథ్యం : చంద్రబాబు వ్యాఖ్య