Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నవరసయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం.. భర్త ప్రాణాలనే తీసిన భార్య

Webdunia
ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (19:22 IST)
కామాంధురాలైన ఓ మహిళ కట్టుకున్న భర్తను కడతేర్చింది. అన్నవరుసయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా, తమ బంధానికి అడ్డుగా ఉన్నాడన్న అక్కసుతో సొంత భర్త ప్రాణాలను తీసింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లా బర్హన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖంద గ్రామానికి చెందిన మృతుడు నోయిడాలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఈయనకు భార్య రవీన, కుమారుడు ఉన్నాడు. వీరంతా కలిసి లాక్‌డౌన్ ప్రకటించడానికి ముందుగానే ఇంటికి వచ్చారు. 
 
ఆ తర్వాత రవీన తమ ఇంటికి పక్కనే నివసించే ప్రతాప్ అనే వ్యక్తితో పరిచయమేర్పడింది. ఈయన ఆమెకు అన్నవరుస అవుతాడు. కానీ కామంతో కళ్లుమూసుకుపోయిన ఆమె... ప్రతాప్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ తర్వాత తమ బంధం చివరి వరకు కొనసాగాలన్న ఉద్దేశ్యంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించింది. దీనికి ప్రతాప్ కూడా సాయం చేశాడు. 
 
దీంతో ఇటీవల ఓ రోజు తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో రవీన అత్యంత పాశవికంగా తన భర్త గొంతు కోసి చంపేసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రవీనను అరెస్టు చేశారు. అయితే ప్రతాప్ మాత్రం పరారీలో ఉన్నాడు. దీనిపై బర్హన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments