ఎమ్‌ఎస్ ఎక్సెల్‌కు స్నాప్‌చాట్ ఓదార్పు యాత్ర..

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (18:39 IST)
సర్ఫ్ ఎక్సెల్‌కు వ్యతిరేకంగా లేచిన ఆన్‌లైన్ ఉద్యమం కాస్తా గురి తప్పి ఎంఎస్ ఎక్సెల్ పీకకు చుట్టుకునేసింది. అయితే దీనిపై ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్ సీఈఓ కునాల్ బళ్ స్పందిస్తూ ‘ఈ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు మిత్రమా’ అంటూ ఎంఎస్ ఎక్సెల్, స్నాప్‌డీల్ అనే ఇద్దరు వ్యక్తులు కౌగిళించుకుంటున్న మెమెను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. 
 
వివరాలలోకి వెళ్తే... రాబోయే రంజాన్‌, హోళీని సమ్మిళితం చేస్తూ హిందూ-ముస్లిం మధ్య స్నేహభావాన్ని చాటే విధంగా సర్ఫ్ ఎక్సెల్ ఓ ప్రకటన రూపొందించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇది ‘లవ్ జిహాద్‌’ను ప్రేరేపించే విధంగా ఉందని కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేసారు.
 
వెంటనే గూగుల్ ప్లేస్టోర్‌లో సర్ఫ్ ఎక్సెల్ యాప్‌కు తక్కువ రేటింగ్ ఇవ్వడం ప్రారంభించేసారు. అయితే... ఇక్కడే పొరపాటు జరిగింది. సర్ఫ్ ఎక్సెల్ అనుకొని కొంతమంది ఎంఎస్ ఎక్సెల్‌కు కూడా తక్కువ రేటింగ్ ఇచ్చేస్తున్నారు. ఇది ఎంఎస్ ఎక్సెల్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
 
ఇంతకీ ఈ బాధ స్నాప్‌డీల్‌కి ఎలా తెలుసంటే... 2017వ సంవత్సరంలో స్నాప్‌డీల్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. స్నాప్‌చాట్‌ అనుకొని చాలా మంది స్నాప్‌డీల్‌కు వ్యతిరేక రివ్యూలు ఇచ్చేసారు. దీనిని దృష్టిలో పెట్టుకొని తన అనుభవాలతో మైక్రోసాఫ్ట్‌ను స్నాప్‌డీల్‌ను ఓదార్చినట్టు మెమె రూపొందించారు. ఏది ఏమైనప్పటికీ... ఈ ఎక్సెల్‍ల బాధ ఎప్పటికి తీరునో.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments