Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాష్ రాజ్ కీలక నిర్ణయం.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ..

Webdunia
మంగళవారం, 1 జనవరి 2019 (15:57 IST)
కొత్త సంవత్సరం ప్రారంభమైన వేళ దేశ ప్రజలు పండగ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లతో పాటు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
 
ఇంకా కొత్త సంవత్సరం అన్నాక.. కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ వుంటారు. ఈ క్రమంలో విలక్షణ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాష్ రాజ్ కొత్త సంవత్సరం సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు. తన ట్వీట్‌లో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
మీ అందరి మద్దతుతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు. ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తానన్నది.. త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. దేశంలో ప్రజా ప్రభుత్వం రానుందని.. చివర్లో #Citizensvoice #Justasking పార్లమెంట్‌లో కూడా అంటూ హ్యాష్ ట్యాగ్‌లు పెట్టారు. ఇక ప్రకాష్ రాజ్ రాజకీయ అరంగేట్రంపై నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ప్రకాష్ రాజ్ రాజకీయాల్లో కూడా రాణించాలని ఆశిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments