Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా చంద్రబాబు నాయుడి రిమాండ్ గడువు పొడిగింపు

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (18:52 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్‌ గడువును ఏసీబీ న్యాయస్థానం పొడిగించింది. ఈ క్రమంలో ఆయన రిమాండ్‌ను అక్టోబర్ 5వ తేదీ వరకు అంటే మరో 11 రోజులు పొడిగించారు. 
 
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ రెండు వారాల క్రితం అరెస్ట్ చేసింది. చంద్రబాబును రెండురోజుల పాటు 12 గంటలకు పైగా విచారించిన సీఐడీ 120 ప్రశ్నలు సంధించింది.
 
ఆదివారంతో రిమాండ్ ముగియడంతో వర్చువల్‌గా ఏసీబీ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కోర్టు బాబు రిమాండ్‌ను అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగించడంతో.. మరో 11 రోజుల పాటు బాబు రిమాండ్‌లో వుంటారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టడం కోసం మరికొన్ని రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ కోరడంతో ఏసీబీ న్యాయస్థానం రిమాండ్‌ను పొడిగించింది. 
 
ఇప్పటికే సీఐడీ రెండు రోజుల పాటు వీకెండ్‌లో తమ కస్టడీకి తీసుకుని బాబును విచారించిన సంగతి తెలిసిందే. కస్టడీ సైతం ఆదివారంతో ముగియడంతో ఈ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు మరికొన్ని రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ కోరింది. ఇకపోతే.. సోమవారం  బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపనున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments