ఇకపై ఓటరు నమోదుకు ఆధార్ కార్డు తప్పనిసరికాదు

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (10:26 IST)
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఓటరు నమోదుకు ఆధార్ నంబరు తప్పనిసరికాదని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఫారమ్ 6బీలో అవసరమైన మార్పులు చేస్తామని సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేసింది. 
 
ఓ రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్‌ను సమర్పించింది. ఇప్పటికే 66 కోట్లకు పైగా ఆధార్ కార్డులను ఓటర్ కార్డులతో జత చేసినట్లు గుర్తు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోరల్స్ సవరణ రూల్స్ 2022 కింద ఆధార్ తప్పనిసరి కాదని పేర్కొంది.
 
ఎన్నికల గుర్తింపుకార్డుతో ఆధార్ నెంబరును అనుసంధానం చేసేందుకు వీలుగా కేంద్రం గత ఏడాది జూన్ నెలలో ఓటర్ల నమోదు (సవరణ) రూల్స్ 2022ని నోటిఫై చేసింది. తెలంగాణ కాంగ్రెస్ నేత నిరంజన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం అండర్ టేకింగ్‌ను సమర్పించింది. అండర్ టేకింగ్‌లో ఫారం 6, ఫారమ్ 6బీలో అవసరమైన మార్పులు చేస్తామని తెలిపింది. ఓటర్ల నమోదు (సవరణ) రూల్స్ 2022లోని రూల్ 26బీ ప్రకారం ఆధార్ నెంబర్ సమర్పణ తప్పనిసరి కాదని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం