Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో హద్దు మీరిన భార్య.. ఉరేసుకున్న భర్త.. కుమారుడికి విషమిచ్చి?

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (19:16 IST)
సోషల్ మీడియా ప్రభావంతో ఎంత మేలు జరుగుతుందనే విషయాన్ని పక్కనబెడితే.. సామాజిక ప్రసార మాధ్యమాల వల్ల మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌లో భార్య హద్దుమీరిన కారణంగా మనస్తాపానికి గురైన భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని కోవైలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కోవై, శరవణంపట్టికి చెందిన అర్జున్ (46) టైలర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య అలమేలు (40) ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఈ దంపతులకు ఓ కుమారుడు వున్నాడు. ఇతడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం పని ముగించుకుని ఇంటికి చేరుకున్న అలమేలు.. ఇంటి లోపల లాక్ అయి వుండటం గమనించి కిటికీలను తెరిచి చూసింది. 
 
అంతే.. భర్త, కుమారుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం చూసి షాకైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి మొత్తం తనిఖీలు చేశారు. ఇలా పోలీసులకు ఓ సూసైడ్ నోట్ దొరికింది. 
 
ఈ లేఖలో అలమేలు వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం వుందని.. ఆమె వాట్సాప్‌లో హద్దుమీరిందని.. దీంతో మనస్తాపానికి గురైన తాను.. కుమారుడికి విషం ఇచ్చి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నానని రాశాడు. దీనిపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments