ఒక్క సెకనులో.. ప్రాణాలు పోయాయ్.. లారీ టైర్‌ కింద..?

బుధవారం, 5 జూన్ 2019 (12:25 IST)
సోషల్ మీడియా ప్రభావంతో ఎక్కడ చిన్న విషయం జరిగినా అది కాస్త వీడియో రూపంలో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వీటిల్లో కొన్ని మంచి విషయాలున్నప్పటికీ.. కొన్ని సంఘటనలకు సంబంధించిన వీడియోలు మాత్రం బాధకలిగిస్తుంటాయి. అలాంటివే రోడ్డు ప్రమాదాలు. రోడ్డు ప్రమాదాలు ప్రస్తుతం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అవుతున్నాయి. వాటి తాలూకు వీడియోలు కూడా నెట్టింట కనిపిస్తున్నాయి. 
 
అలాంటి వాటిల్లో ఒకటే ఈ రోడ్డు ప్రమాదం. ఈ వీడియోలో ఒక్క సెకనులో ఓ వ్యక్తి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ వీడియో చూసిన వారంతా షాకవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు కాంచీపురంకు తర్వాత కనకాపట్టు ప్రాంతానికి చెందిన ప్రభు (35)కు ఇద్దరు పిల్లలున్నారు. ఇతను పిల్లలను స్కూలు నుంచి ఇంటికి బైకుపై కేళంబాక్కం మార్గం ద్వారా షోళింగనల్లూరుకు వెళ్తుండగా.. అప్పుడు ఆంధ్రా నుంచి అధిక బరువుతో వచ్చిన ఇసుక లారీ ప్రభు బైకును ఢీకొంది. 
 
ఈ ఘటనలో ప్రభు తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. లారీ టైర్ కింద ప్రభు తల నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ ఘటనను చూసినవారంతా షాకయ్యారు. అయితే లారీ డ్రైవర్ బండిని ఆపకుండా అలాగే డ్రైవ్ చేస్తూ వెళ్లిపోవడంతో లారీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు. ఇంకా ఈ ప్రమాదానికి కారణం.. ఓ సైకిల్ అడ్డురావడమేనని పోలీసులు వెల్లడించారు. సైకిల్ బైకు ముందుకు రావడంతో ప్రభు బైక అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ముస్లింను కించపరిచేలా వున్న పబ్జీ గేమ్‌.. యువతను తప్పుదోవ పట్టించేందుకే?