ముస్లింను కించపరిచేలా వున్న పబ్జీ గేమ్‌.. యువతను తప్పుదోవ పట్టించేందుకే?

బుధవారం, 5 జూన్ 2019 (11:57 IST)
ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన పబ్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే ఈ పబ్జీ గేమ్ ఆడుతూ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఈ పబ్జీ గేమ్‌పై ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పబ్జీ గేమ్ ఇస్లాం మతాన్ని కించపరిచేలా వుందని తమిళనాడు ముస్లిం లీగ్ సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. 
 
పబ్జీ అనే ఈ వీడియో గేమ్‌కు పిల్లలు అడిక్ట్ అవుతున్నారని.. బాలురే కాకుండా పెద్దలు కూడా పబ్జీ గేమ్ ఆడుతూ గంటల పాటు ఫోన్లకే అతుక్కుపోతున్నారు. ఈ గేమ్ యువత మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతోంది. అంతేగాకుండా ఇస్లాంను కించపరిచేలా ఈ గేమ్ వుందని ముస్లిం సమాఖ్య వ్యతిరేకించింది. 
 
ఈ ఫిర్యాదులో భారత్‌లో ఇతర దేశాల కంటే అధిక సంఖ్యలో యువత వున్నారని.. అలాంటి వారిని ఇలాంటి గేమ్‌లు పాడు చేస్తున్నట్లు సమాఖ్య వెల్లడించింది. అంతేగాకుండా.. ఆన్‌లైన్ గేమ్‌ల ద్వారా భారత్ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్లడాన్ని కళ్లెం వేస్తున్నట్లుందని.. యువతను తప్పదోవ పట్టించేందుకే ఇలాంటి ఆన్‌లైన్ గేమ్‌లను భారత్‌లోకి విదేశీ శక్తులు ప్రవేశపెడుతున్నాయని ముస్లిం లీగ్ సమాఖ్య తప్పుబట్టింది. ముఖ్యంగా పబ్జీ గేమ్‌లో ఇస్లాంల పవిత్ర స్థలాన్ని కించపరుస్తున్నట్లు వుందని ఆ సమాఖ్య వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ప్రియురాలిపై ప్రియుడు లైంగికదాడి... సహకరించిన తల్లి