వామ్మో.. వైరల్ అవుతున్న వాకమ్ ఛాలెంజ్.. చాలా డేంజర్

సోమవారం, 3 జూన్ 2019 (12:45 IST)
వాకమ్ ఛాలెంజ్ పేరిట ప్రమాదకరమైన సవాల్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటూ వీడియోలను నెట్టింట షేర్ చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో రోజుకో విషయం ట్రెండింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వాకమ్ ఛాలెంజ్ వైరల్ అవుతోంది. మోమో ఛాలెంజ్, టెన్ ఇయర్స్ ఛాలెంజ్ వంటి పలు ఛాలెంజ్‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఇదే తరహాలో Vacuum Challenge అనే పేరిట కొత్త ఛాలెంజ్ వైరల్ అవుతోంది. ఈ ఛాలెంజ్ ప్రకారం పెద్ద ప్లాస్టిక్ బ్యాగులో ఒకరు కూర్చోవాలి. తర్వాత ఆ బ్యాగులో వాకమ్ క్లీనర్‌ను వుంచి.. మరొకరు ఆన్ చేస్తారు. కొద్ది సేపట్లో ప్లాస్టిక్ బ్యాగులో వుండే వ్యక్తి శరీరాన్ని.. ప్లాస్టిక్ సంచి లాగేసుకుంటుంది. వైరల్ అవుతున్న ఈ ప్రమాదకరమైన ఛాలెంజ్‌ను బాలబాలికలను చేసి వీడియోలను నెట్టింట పోస్టు చేశారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నన్ను చేసిన వ్యక్తి కుమార్తెను రేప్ చేసి పగ తీర్చుకున్నా...