Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయంత్రం స్పెషల్ క్లాస్ అంటూ విద్యార్థినికి లైంగిక వేధింపు... బడితె పూజ...

Webdunia
సోమవారం, 22 అక్టోబరు 2018 (20:35 IST)
విద్యాబుద్ధులు చెప్పి తన వద్ద చదువుకునే బాలబాలికలను తన కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన గురువు కామంతో కొట్టుమిట్టాడాడు. ఫలితంగా ఆ బాలిక బంధువులతో చావుదెబ్బలు తిన్నాడు. 
 
వివరాలను చూస్తే... తమిళనాడులోని తిరువన్నామలైలో తన వద్ద చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థునుల్లో ఓ బాలికపై కన్నేశాడు కన్నన్ అనే ఉపాధ్యాయుడు. అంతే... ఆమెను స్పెషల్ క్లాస్ పేరిట పాఠశాలలో వుంచి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనితో సదరు బాలిక స్కూలు మానేసి ఇంట్లోనే వుండిపోయింది. ఆమె పాఠశాలకు ఎందుకు వెళ్లడంలేదని నిలదీస్తే అసలు విషయం బయటపడింది.
 
ఆగ్రహంతో రగిలిపోయిన బాలిక తల్లిదండ్రులు మరో 20 మందితో కలిసి వెళ్లి పాఠశాలలో చదువు చెపుతున్న సమయంలోనే కన్నన్ అనే ఉపాధ్యాయుడిని అంతా చూస్తుండగానే చితక్కొట్టడం మొదలుపెట్టారు. ఎంతమంది అడ్డు వచ్చినా ఆగలేదు. చివరికి స్కూలు యాజమాన్యం ప్రాధేయపడటంతో అతడిని వదిలిపెట్టారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం