Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

ఠాగూర్
ఆదివారం, 16 ఫిబ్రవరి 2025 (18:22 IST)
కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగర సమీపంలోని నెలమంగళ టోల్‌ప్లాజాలో ఓ ఆరాచక ఘటన జరిగింది. టోల్‌గేట్ వద్ద ఓ వ్యక్తిని కారు ఒకటి కొంతదూరం లాక్కెళ్లి పడేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు ఈ షాకింగ్ ఘటన వివరాలను పరిశీలిస్తే, టోల్‌గేట్ వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టోల్‌గేట్ వద్ద ఓ కారును మరోకారు ఓవర్ టేక్ చేయడంతో సదరు కారులో వ్యక్తి... ముందుకు వచ్చి కారులో ఉన్న వ్యక్తిని ప్రశ్నించాడు. దీంతో టోల్ ‌బూత్‌‍లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ముందు కారులో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఆవేశంతో రగిలిపోయాడు.
 
ఈ క్రమంలోనే కారు స్టార్ట్ చేసి వాగ్వాదానికిదిగన వ్యక్తి కాలర్ పట్టుకుని ముందుకు పోనిచ్చాడు. ఆ తర్వాత కారు ఆ వ్యక్తిని దాదాపు 50 మీటర్ల దూరం కారు ఈడ్చుకెళ్లింది. కొంతదూరం వెళ్లాక అతడిని వదిలిపెట్టడంతో ఆయన కిందపడిపోయాడు. కారు డ్రైవర్ మాత్రం ఆగకుండా వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments