గుంటూరు జిల్లా తెనాలిలో కాకినాడ యువకుడు కిడ్నాప్ చేసి కరెంట్ షాక్‌తో చిత్రహింసలు పెట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలన పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలో వ్యాపారం చేస్తున్న తెనాలికి చెందిన మణిదీప్ వద్ద కాకినాడ పెద్దాపురానికి చెందిన సతీశ్ అనే యువకుడు గతంలో పనిచేసి మానేశాడు. ఆ సమయంలో అతడికి రెండు నెలల వేతనం మణిదీప్ ఇవ్వాల్సివుంది. దీంతో వాటి కోసం సతీశ్ తరచుకూ మణిదీప్‌కు ఫోన్ చేస్తుండేవాడు.
ఈ క్రమంలో తాజాగా మరోమారు ఫోన్ చేయడంతో విజయవాడ వచ్చి తీసుకెళ్లాలని మణిదీప్ చెప్పాడు. దీంతో అతని మాటలు నిజమని నమ్మి శుక్రవారం సాయంత్రం విజయవాడకు వచ్చిన సతీశ్‌ను మణిదీప్‌తో సహా మరో నలుగురు బలవంతంగా కారులో ఎక్కించుకుని తెనాలి తీసుకెళ్లారు. మార్గమధ్యంలో అతడిపై అందరూ కలిసి దాడిచేశారు. ఆ తర్వాత ఓ ఇంట్లోకి తీసుకెళ్లి కరెట్ షాక్ ఇచ్చి బంధించారు.
ఆ తర్వాత సతీశ్‌ను అర్థరాత్రి కారులో ఎక్కించుకుని తీసుకెళతుండా తెనాలి - గుంటూరు వంతెనపై పోలీసులు వాహనం వస్తుండటంతో బాధితుడు కేకలు వేశాడు. దీంతో నిందితులు కారు ఆపడంతో సతీశ్ వెంటనే బయటకుదూకి పోలీసలకు విషయం చెప్పడంతో నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మిగిలినవారు పారిపోయినట్టు సమాచారం. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.