Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకి రూ. 50 లక్షలు విరాళం ఇస్తున్నా: పవన్ కల్యాణ్

Advertiesment
pawan kalyan

ఐవీఆర్

, శనివారం, 15 ఫిబ్రవరి 2025 (23:05 IST)
తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్, దాని ద్వారా వచ్చే డబ్బును బాధితులకు ఖర్చు పెట్టాలన్న మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆలోచన ఎందరో బాధితులకు మేలు చేస్తుందని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. టిక్కెట్ కొనుక్కుని వద్దామంటే భువనేశ్వరి గారు వద్దన్నారు, అందుకే ఎన్టీఆర్ ట్రస్టుకి నావంతు సాయంగా రూ. 50 లక్షలను తలసేమియా బాధితుల కోసం విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు డిప్యూటీ సీఎం పవన్.
 
'తలసేమియా భాదితుల కోసం ఈ నెల 15 న మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసాము. ప్రతి టికెట్ పై వచ్చే రూపాయి తలసేమియా భాదితులకు అందిస్తాం. అడియన్స్ ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి తిరిగి సమాజ సేవకే ఉపయోగపడుతుంది' అన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అద్వర్యంలో ఫిబ్రవరి15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ షో జరుగుతోంది.  
 
ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు మాట్లాడుతూ.. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే స్ఫూర్తితో ఎన్టీఆర్ ట్రస్ట్ నడుస్తుంది. జెనిటిక్ డిసార్డర్ తలసేమియాతో చాలామంది పిల్లలు, పెద్దలు బాధపడుతున్నారు. ఈ వ్యాధి వున్న వారు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇది తీవ్రంగా వచ్చినప్పుడు రక్తమార్పిడి వెంటనే జరగాలి. దీనికి చాలా రక్తం అవసరం. బ్లడ్ డొనేట్ చేస్తే చాలామంది జీవితాలు నిలబడతాయి. తలసేమియా బాధితుల కోసం మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసాము. ప్రతి టికెట్ పైన వచ్చే రూపాయి తలసేమియా భాదితులకు అందిస్తాం. తమన్ కూడా ఒక్క నిమిషం ఆలోచించకుండా వెంటనే మ్యూజికల్ నైట్‌కి వస్తా అన్నారు. 
 
తమన్ ఈ షో ఫ్రీగా చేస్తా అని గొప్ప హృదయంతో చెప్పారు. ఆయనకి ఎప్పుడు దేవుని ఆశీస్సులు వుంటాయి. ప్రతి ఒక్కరు తెలుగు తల్లికి రుణం తీర్చుకోవాలి. సమాజ సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేయాలి. మనం వెళ్ళేటప్పుడు మన వెంట డబ్బు రాదు... ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే అందరికి గుర్తు ఉంటుంది. ప్రతి ఒక్కరు కొనే టికెట్ సమాజ సేవకే ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ టికెట్ కొనుక్కొని కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఆడియన్స్ ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి తిరిగి సమాజ సేవకే ఉపయోగపడుతుంది' అన్నారు
 
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. చాలా మంచి ఆలోచనతో మొదలైన కార్యక్రమం ఇది. ఈ షో నేను చేయడం చాలా సంతోషంగా ఉంది. నారా భువనేశ్వరి గారి ఆలోచన చాలా గొప్పది. తలసేమియా భాదితులకు సహాయం కోసం అని చెప్పగానే నేను వెంటనే ఈ కార్యక్రమంకి వస్తా అని చెప్పాను. భువనేశ్వరి గారు నాపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద కార్యక్రమం నా చేతిలో పెట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు గారు రాష్ట్రం కోసం పగలు రాత్రి పని చేస్తున్నారు. టికెట్ పైన పెట్టె ప్రతి రూపాయి తలసేమియా భాదితులకు వెళ్తుంది. ఈ షో చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఈ షోని సూపర్ సక్సెస్ చేసే బాధ్యత మన అందరిపై వుంది. ఇది బిగ్గెస్ట్ షో కాబోతోంది' అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిన్‌టెక్ వర్క్‌షాప్, కెరీర్ అడ్వాన్స్‌మెంట్ సెషన్‌లను నిర్వహించిన KLH గ్లోబల్ బిజినెస్ స్కూల్